Net Run Rate
-
డిఫెండింగ్ చాంపియన్‌కు కష్టమే.. ఇంగ్లండ్ ఓడితేనే
టి20 ప్రపంచకప్‌లో మ్యాచ్ మ్యాచ్‌కు సమీకరణాలు మారిపోతున్నాయి. గ్రూప్-1లో న్యూజిలాండ్ ఐర్లాండ్‌పై గెలిచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. కివీస్ మినహా రెండు గ్రూప్‌ల్లోనూ ఏ జట్టు సెమీస్‌లో అడుగుపెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా శుక్రవారం సూపర్-12 గ్రూప్-1లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి సెమీస్ ఆశలు నిలుపుకున్నప్పటికి మెరుగైన రన్‌రేట్ సాధించలేకపోయింది. రన్‌రేట్ విషయం పక్కనబెడితే ఆసీస్ దాదాపు ఓటమి అంచుల వరకు వెళ్లింది. గతేడాది అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి టైటిల్‌ను ఎగురేసుకుపోయిన ఆస్ట్రేలియా ఈసారి సొంతగడ్డపై ఆకట్టుకునే ప్రదర్శన చేయడం లేదు. అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించినప్పటికి ఆసీస్ సెమీస్ చేరడం కష్టమే. డిఫెండింగ్ చాంపియన్ భవితవ్యం మొత్తం ఇంగ్లండ్ , శ్రీలంక మ్యాచ్‌పైనే ఆధారపడి ఉంది. ఇంగ్లండ్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా పని గోవిందా. దీనికి ప్రధాన కారణం ఆస్ట్రేలియా నెట్‌రన్‌రేట్ మైనస్‌లో ఉండడమే. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 168 పరుగులు చేసింది. +1.187 రన్‌రేట్ ఉండాలంటే ఆస్ట్రేలియా ఆఫ్గన్‌ను భారీ తేడాతో ఓడించాలి. కానీ ఆ అవకాశం ఆఫ్గన్ ఇవ్వలేదు సరికదా.. దాదాపు ఆసీస్‌కు ముచ్చెమటలు పట్టించి ఓడించినంత పని చేసింది. ఈ దెబ్బకు ఆస్ట్రేలియా రన్‌రేట్‌లో పెద్దగా మార్పు జరగలేదు. దీంతో ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక రద్దుతో ఏడు పాయింట్లతో ఉన్నప్పటికి నెట్‌రన్‌రేట్(-0.173) ఇంకా మైనస్‌లోనే ఉంది. ఇక శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్ రన్‌రేట్ ప్లస్‌లో ఉంది.+0.547 రన్‌రేట్‌తో ఉన్న ఇంగ్లండ్ శ్రీలంకపై మాములు విజయం సాధించినా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఇంగ్లండ్‌ను శ్రీలంక చిత్తు చేస్తే మాత్రంఅప్పుడు పాయింట్ల ఆధారంగా ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ను ఓడించడం శ్రీలంకకు పెద్ద సవాల్. అయితే టి20ల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఆస్ట్రేలియా భవితవ్యం రేపటి మ్యాచ్(ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక, నవంబర్ 5న)తో తేలిపోనుంది. చదవండి: రషీద్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఆసీస్‌కు ముచ్చెమటలు AFG VS AUS: ఒకసారి బౌలర్ ఆగాడు.. రెండోసారి బ్యాటర్ ఆపాడు; మూడోసారికి రివేంజ్ -
ICC Womens WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరాలంటే..?
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా మంగళవారం టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు ఆకట్టుకునే ప్రదర్శనతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం టీమిండియా ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు.. మూడు ఓటములతో ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి నెట్‌రన్‌రేట్‌ను కూడా మెరుగుపరుచుకుంది. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు మైనస్‌లో ఉన్న రన్‌రేట్.. ఇప్పుడు +0.768గా ఉంది. కాగా సెమీస్‌లో మూడు, నాలుగు స్థానాల కోసం ఇంగ్లండ్, భారత్, వెస్టిండీస్ పోటీపడుతున్నాయి. ఇంగ్లండ్‌కు రెండు మ్యాచ్‌లు ఉన్నప్పటికి నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ జట్టు తాను ఆడబోయే రెండు మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇక ఆదివారం(మార్చి 27న) సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సమీకరణాలు అవసరం లేకుండా 8 పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ సాతాఫ్రికాతో మ్యాచ్‌లో ఓడినప్పటికి మరో అవకాశం ఉంది. టీమిండియాతో మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గనుక వెస్టిండీస్ ఓడిపోతే.. టీమిండియా సెమీస్‌కు చేరుకుంటుంది. అలా కాకుండా వెస్టిండీస్ గెలిస్తే టీమిండియాకు నెట్‌రన్‌రేట్ కీలకం కానుంది. సౌతాఫ్రికాతో మ్యచ్‌లో టీమిండియా ఓడినప్పటికి.. తక్కువ పరుగుల తేడాతో ఓడిపోవాలి. అప్పుడే నెట్ రన్‌రేట్ ఆధారంగా సెమీస్‌కు వెళుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనతో మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా వెస్టిండీస్‌ను ఓడిస్తే సరిపోతుంది. చదవండి: PAK vs AUS: బాబర్ ఆజం.. కేవలం రికార్డుల కోసమే టెస్టు సిరీస్ ఆడుతున్నావా? World Cup 2022: అరుదైన రికార్డు సాధించిన గోస్వామి.. తొలి భారత బౌలర్‌గా! View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup 2021 IND Vs SCO: టీమిండియా 7.1 ఓవర్లలో కాదు.. 6.3 ఓవర్లలోనే
Update: స్కాట్లాండ్పై ఘన విజయంతో భారత్ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకుంది. టీమిండియా రన్‌రేట్ +1.619కు చేరింది. దీంతో గ్రూపు2లో భారత్ మూడో స్ధానానికి చేరుకుంది. ముందుగా అంచనా వేసినట్లుగా 7.1 ఓవర్లకు బదులు 6.3 ఓవర్లలోనే 86 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. స్కోర్లు: స్కాట్లాండ్- 85 (17.4) టీమిండియా- 89/2 (6.3) Team India Will Cross Afghanistan Net Run Rate If Target Is Chased In 7.1 Overs: టీ20 ప్రపంచకప్-2021 గ్రూప్-2లో సమీకరణలు మ్యాచ్ మ్యాచ్‌కి మారుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి పాక్ ఇదివరకే సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్, భారత్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇవాళ భారత్, స్కాట్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 85 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో సరికొత్త సమీకరణలు తెరపైకి వచ్చాయి. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ నిర్ధేశించిన 86 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 11.2 ఓవర్లలో ఛేదిస్తే నెట్ రన్‌రేట్ +1.000కి చేరుతుంది. అదే 8.5 ఓవర్లలో ఛేదిస్తే.. న్యూజిలాండ్ రన్‌రేట్(+1.277)ను క్రాస్ చేస్తుంది. 86 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 7.1 ఓవర్లలో ఛేదించగలిగితే అఫ్గనిస్థాన్ రన్‌రేట్(+1.481)ను దాటి సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకునే అవకాశం ఉంది. చదవండి: T20 WC 2021 NZ Vs NAM: కివీస్ బౌలర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..