![Mother From Scotland Gets Baby Sons Body From Hospital After 48 Years - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/17/baby.jpg.webp?itok=r_PMZPUs)
ఓ తల్లి ఏడాది వయసున్న బిడ్డను కోల్పోయింది. అసలు బిడ్డను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న తల్లికి కనీసం ఆ బిడ్డ కడచూపు దక్కక అల్లాడిపోయింది. అందు కోసం కళ్లు కాయలు కాసేలా నిరీక్షించిన ఆమె ఓపికకు చేతులెత్తి నమస్కరించాలి. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన తన బిడ్డ మృతదేహాన్ని తనివితీరా చూసుకుని మరీ ఖననం చేసింది.
అసలేం జరిగిందంటే..స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌కు చెందిన 74 ఏళ్ల లిడియా రీడ్ 1975లో ఏడాది వయసు ఉన్న బిడ్డను కోల్పోయింది. ఆ చిన్నారి రీసస్ అనే వ్యాధి కారణంగా మరణించాడు. గర్భిణీ స్త్రీ రక్తంలోని ప్రతిరక్షకాలు ఆమె శిశువు రక్తకణాలను నాశనం చేసి చనిపోయేలా చేయడమే ఆ వ్యాధి లక్షణం. ఆమె కొన్ని రోజుల తర్వాత తన బిడ్డను చూడాలని ఆస్పత్రి వర్గాలను కోరినప్పుడూ ఆమెకు వేరే బిడ్డను చనిపోయారు. దీంతో రీడ్‌కి తన కొడుకు అవయవాలు పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారా లేక తొలగించారా? అన్న అనుమానంతో కోర్టు మెట్లు ఎక్కింది.
తన బిడ్డకు చనిపోయిన అనంతరం వైద్యులు పోస్ట్‌మార్టం కూడా నిర్వహించారని రీడ్ చెబుతుంది. అక్కడ ఆస్పత్రి రూల్స్ ప్రకారం..అంత చిన్న వయసులో చనిపోయిన చిన్నారులను వారే ఖననం చేస్తారు. అందువల్ల ఆమె బిడ్డ చనిపోయాడని తెలియడంతో దుఃఖంలో మునిగిపోయింది. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్ని ఆస్పత్రి వర్గాలే నిర్వర్తించాయి. ఆమె ఆ బాధ నుంచి బయటపడ్డాక ఒక్కసారి తన బిడ్డను చూడాలని శవపేటికను తెరిచి చూపించాలని ఎంతగానో ప్రాధేయపడింది అయితే అందుకు ఆస్పత్రి యజమాన్యం అంగీకరించి, చూపించింది కానీ అది తన బిడ్డ కాదనేది రీడ్ వాదన.
అందుకోసం చాలా ఏళ్లు కోర్టులో పోరాడింది. చివరికి సెప్టెంబర్ 2017లో కోర్టు ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆ బిడ్డను ఆమెకు చూపించమని ఆదేశించగా.. ఖననం చేసిన ప్రదేశంలో బిడ్డ లేదని తేలింది. ఆమె పోరాటం కారణంగా సదరు ఆస్పత్రి ఆల్డర్ హే బాగోతం బయటపడింది. చనిపోయిన పిల్లల శరీర భాగాలను ఆస్పత్రులు ఎలా చట్టవిరుద్ధంగా పరిశోధనలకు ఉపయోగిస్తున్నాయో బహిర్గతం అయ్యింది. ఈ మేరకు స్కాట్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ చేసిన దర్యాప్తులో 1970 నుంచి 2000 మధ్య కాలంలో చిన్నపిల్లలకు సంబంధించి దాదాపు 6 వేల అవయవాలు, కణజాలం ఉంచినట్లు తేలింది. ఎట్టకేలకు ఆమె పోరాటం ఫలించి చనిపోయిన తన బిడ్డ మృతదేహాన్ని తిరిగి పొందగలిగింది. ఎలాగైతే చనిపోయేలోగా నా బిడ్డను చూడగలిగానని ఆనందంతో ఉప్పోంగిపోయింది. శనివారమే తన కొడుకు అంత్యక్రియలు జరిపిస్తానని తానే దగ్గరుండి పర్యవేక్షిస్తానని ఆనందబాష్పాలతో చెబుతోంది.
(చదవండి: బద్ధ శత్రువులైన ఇరాన్, సౌదీల మధ్య సయోధ్య కుదిర్చిన చైనా!)
Comments
Please login to add a commentAdd a comment