
రెండు సార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ వెస్టిండీస్‌కు పసికూన స్కాట్లాండ్ బిగ్ షాకిచ్చింది. హోబార్ట్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2022 గ్రూప్ ‘బి’ తొలి రౌండ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను స్కాట్లాండ్ చిత్తు చేసింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. కేవలం 118 పరుగులకే కుప్పకూలింది.
స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ మూడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. లీసక్, వీల్ తలా రెండు వికెట్లు, డేవి, షరీఫ్ చెరో వికెట్ సాధించారు. విండీస్ బ్యాటర్లలో జాసన్ హోల్డర్(38 పరుగులు) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు.
ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ మున్సీ(53 బంతుల్లో 66 నటౌట్) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో హోల్డర్, జోసఫ్ చెరో రెండు వికెట్లు సాధించగా.. స్మిత్ ఒక్క వికెట్ సాధించాడు. మరోవైపు ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీలంకను నమీబియా చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే.
చదవండి: IND Vs AUS: నిమిషాల వ్యవధిలో రెండు అద్భుతాలు.. దటీజ్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment