టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 4) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-బిలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. పసికూన స్కాట్లాండ్‌తో తలపడనుండగా.. గ్రూప్-డిలో భాగంగా నెదర్లాండ్స్-నేపాల్ జట్లు పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్-స్కాట్లాండ్ మ్యాచ్ బార్బడోస్ వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుండగా.. డల్లాస్ వేదికగా నెదర్లాండ్స్-నేపాల్ సమరం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.
కాగా, టీ20 ప్రపంచకప్ 2024లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. డల్లాస్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కెనడాపై యూఎస్‌ఏ 7 వికెట్ల తేడాతో గెలుపొందగా.. గయానాలో జరిగిన రెండో మ్యాచ్‌లో పపువా న్యూ గినియాపై వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో చెమటోడ్చి నెగ్గింది.
బార్బడోస్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో ఒమన్‌పై నమీబియా సూపర్ ఓవర్‌లో విజయం సాధించగా.. న్యూయార్క్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. తాజాగా గయానా వేదికగా జరిగిన ఐదో మ్యాచ్‌లో ఉగాండపై ఆఫ్ఘనిస్తాన్ 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మెగా టోర్నీలో భారత తొలి మ్యాచ్ న్యూయార్క్ వేదికగా రేపు జరుగనుంది. ఐర్లాండ్‌తో జరుగబోయే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్‌లో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment