
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్‌లాండ్ (టాస్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడేళ్ల తర్వాత జరుగుతున్న వేడుకలు కావడంతో టాస్ కన్నుల పండువగా ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. సినీ నేపథ్య గాయని ఉషా పాటలు అలరించాయి.
టాస్ సాంస్కృతిక కార్యదర్శి నిరంజన్ నూక ఆధ్వర్యంలో టాస్ ప్రస్తుత, పూర్వ కార్యనిర్వాహాక సభ్యుల జ్యోతి ప్రజ్వాలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను చూసి ఇండో, స్కాటీష్ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
ఉగాది వేడుకలను పురస్కరించుకుని టాస్ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. టాస్ చైర్‌పర్సన్‌గా మైథిలీ కెంటూరీ, అధ్యక్షుడిగా శివ చింపిరి, ప్రధాన కార్యదర్శిగా ఉదయ్ కుమార్ కూదాడి, సంయుక్త కార్యదర్శిగా వెంకటేష్ గడ్డం, కోశాధికారిగా నిరంజన్ నూక, సాంస్కృతిక కార్యదర్శిగా మర్రి విజయ్‌కుమార్, మహిళా కార్యదర్శిగా మాధవీలత, క్రీడా కార్యదర్శిగా జాకీర్‌షేక్, ఐటీ, మీడియా కార్యదర్శిగా పండరీ జైన్ పొలిశెట్టి, యువజన కార్యదర్శిగా నరేశ్ దీకొండ, అసోసియేట్స్ ప్రాజెక్ట్ కార్యదర్శిగా కర్నాటి బాలాజీ, అసోసియేట్స్ క్రీడా కార్యదర్శిగా సాంబ రాజశేఖర్‌లు ఎన్నికయ్యారు.