తెలుగు అసోసియేషన్ అఫ్ స్కాట్లాండ్, యూనెటైడ్ కింగ్‌డమ్ ప్రతి ఏటా నిర్వహించే దీపావళి సంబరాలను ఈసారి ఘనంగా జరిగాయి. స్కాట్లాండ్ తెలుగు ప్రజల సమక్షంలో క్రమండ్ కిర్క్ హాల్, ఇడిన్‌బరోలో జరిగిన ఈ కార్యక్రమంలో వయోభేదం లేకుండా అంతా ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్ లో ఉన్న తెలుగు వారిని, వివిధ భాషలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శివ చింపిరి గారు ప్రసంగిస్తూ గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు టాస్ చేసిన కార్యక్రమములను వివరించారు. అలాగే పూర్వ కమిటీ సభ్యులకు మరియు వాలంటీర్స్ అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేశారు. టాస్ చైర్మన్ శ్రీమతి మైథిలి కెంబూరి గారు ప్రసంగిస్తూ కరోనా తర్వాత తెలుగు ప్రజలందరి మధ్యన దీపావళి వేడుకలు ఘనంగా కార్యక్రమం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమం సాంస్కృతిక కార్యదర్శి నిరంజన్ నూక, స్పోర్ట్స్ కార్యదర్శి సాయి చైతన్య ప్రత్తిపాటి, భవాని చిటికిరెడ్డి, వైష్ణవి శ్రీనివాస్, రిత్విక్, వెంకటేష్ గడ్డం, మాధవి అప్పరాల, నిరంజన్ ఉదయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment