T20 WC NZ Vs SCO: ఇండియా మొత్తం నీకు మద్దతుగా ఉంది.. కమాన్‌ గ్రేవో | T20 WC NZ Vs SCO: Whole India Behind You Scotland Wicket Keeper Comments Bowler | Sakshi
Sakshi News home page

T20 WC NZ Vs SCO: ఇండియా మొత్తం నీకు మద్దతుగా ఉంది.. కమాన్‌ గ్రేవో

Published Wed, Nov 3 2021 6:58 PM | Last Updated on Wed, Nov 3 2021 7:10 PM

T20 WC NZ Vs SCO: Whole India Behind You Scotland Wicket Keeper Comments Bowler - Sakshi

PC: ICC

The whole of India is behind you - Scotland wicket-keeper eggs bowler on against New Zealand: టీ20 వరల్డ్‌కప్‌- 2021 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌- స్కాట్లాండ్‌ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్కాట్లాండ్‌ వికెట్‌ కీపర్‌ మాథ్యూ క్రాస్‌ తమ బౌలర్‌ క్రిస్‌ గ్రీవ్స్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. కాగా పిచ్‌ ప్రభావం చూపే దుబాయ్‌ మైదానంలో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న  స్కాట్లాండ్‌ ఫర్వాలేదనిపించింది. 

బౌలర్లు వీల్‌, సఫ్యాన్‌ షరీఫ్‌ రెండేసి వికెట్లు తీయగా... మార్క్‌ వాట్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన కివీస్‌ జట్టు 172 పరుగులు చేసింది. అయితే, న్యూజిలాండ్‌ క్రికెటర్లు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో స్కాట్లాండ్‌ వికెట్‌ కీపర్‌ మాథ్యూ క్రాస్‌.. తమ బౌలర్‌ క్రిస్‌ గ్రీవ్స్‌ను సరదాగా ఆటపట్టించాడు.

గ్లెన్‌ ఫిలిప్స్‌కు బౌలింగ్‌ చేస్తున్న సమయంలో ... ‘‘కమాన్‌ గ్రేవో... ఇండియా మొత్తం నీకు మద్దతుగా నీ వెనకాలే ఉంది. కమాన్‌ గ్రేవో’’ అంటూ ఉత్సాహపరిచాడు. ఈ మాటలు స్టంప్‌ మైక్‌లో రికార్డయ్యాయి.  కాగా పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో వరుస పరాజయాల నేపథ్యంలో టీమిండియా సెమీస్‌ అవకాశాలు సన్నగిల్లిన సంగతి తెలిసిందే.

దీంతో.. సెమీ ఫైనల్‌కు వెళ్లాలంటే.. తదుపరి 3 మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించడం సహా... ఇతర జట్ల గెలుపోటములుపై ఆధారపడాల్సిన దుస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్‌ కివీస్‌పై గెలిస్తే.. భారత్‌కు అవకాశాలు ఉంటాయని టీమిండియా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మాథ్యూ క్రాస్‌ కూడా ఇదే తరహాలో కామెంట్‌ చేయడం విశేషం. కానీ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బలమైన కివీస్‌.. పసికూన స్కాట్లాండ్‌పై 16 పరుగుల తేడాతో గెలుపొంది అందరి ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, స్కాట్లాండ్‌ పోరాడిన తీరును మాత్రం అభిమానులు అభినందిస్తున్నారు.

చదవండి: Gautam Gambhir: ధోని గురించి తెలుసు.. అలా చేయడు.. కోహ్లి నిర్ణయం వల్లే ఇదంతా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement