చార్మినార్ లో స్కాట్లాండ్ పర్యాటకుడికి వింత అనుభవం
అవి ప్లాస్టిక్ ముత్యాలని చెప్పిన చిరు వ్యాపారి
అతడి నిజాయతీకి ముగ్ధుడైన విదేశీయుడు
సాక్షి, సిటీబ్యూరో: ఎవరైనా ఏదైనా పర్యాటక ప్రదేశానికి వస్తే చిరు వ్యాపారులు అధిక ధరలు చెబుతారనేది అందరి అభిప్రాయం. మనం వేరే రాష్ట్రాలు లేదా దేశానికి వెళ్లినప్పుడు ఇలాంటి అనుభవం ఒకటి రెండుసార్లు మనకు కూడా బహుశా ఎదురయ్యే ఉంటుంది! అయితే.. మన హైదరాబాద్‌లో కొద్ది రోజులుగా పర్యటిస్తున్న ఓ విదేశీయుడికి భిన్న అనుభవం ఎదురైంది. చారి్మనార్‌ను చూసేందుకు స్కాట్లాండ్‌కు చెందిన హ్యూ అనే వ్యక్తి వచ్చాడు.
అక్కడ కలియదిరుగుతూ నగర ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆభరణాలు, మట్టి గాజుల గురించి ఆరా తీస్తూ వస్తున్నాడు. అప్పుడే ఓ చిరు వ్యాపారి ముత్యాల హారాలను అమ్ముతూ కనిపిస్తే వాటి ధర ఎంతో అడిగాడు. అయితే.. అందరిలా అవి ఒరిజినల్ ముత్యాలంటూ మభ్య పెట్టకుండా ప్లాస్టిక్ ముత్యాలని నిజాయతీగా చెప్పాడు. అలాగే.. లైటర్‌తో కాల్చి ఇవి, ఒరిజినల్ కాదని పేర్కొన్నాడు. పైగా ధర కూడా రూ.150 అనడంతో చాలా నిజాయతీపరుడివి అంటూ కితాబిచ్చాడు.
తిరిగి పర్యాటకుడి వివరాలను ఆరా తీశాడు. స్కాట్లాండ్ అని సమాధానం చెప్పాడు. వెంటనే పర్యాటకుడిని ఆ చిరు వ్యాపారి ఫ్రెంచ్‌లో పలకరించాడు. ఓ..ఫ్రెంచ్ కూడా వస్తుందా అని అడిగి షాక్ అయ్యాడు. ఇదంతా వీడియో తీసి తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పైగా హైదరాబాద్ పరువు కాపాడావంటూ నెటిజన్లు అతడిని తెగ పొగిడేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment