స్కాట్లాండ్‌లోని ఒక ఇంటి ఆవరణలో ప్లంబర్ పీటర్ అలెన్ తవ్వుతున్నాడు. ఆ ఇంటికి సంబంధించిన నీళ్ల పంపుల కోసం నేలను తవ్వుతుండగా...ఒక పురాత గాజు బాటిల్ కనిపించింది. దీంతో అతను ఆశ్చర్యపోయి తన యజమాని ఎలిద్ స్టింప్సన్ వద్దకు తీసుకువచ్చాడు. ఆమె కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ...స్కూల్‌కి వెళ్లిన తన పిల్లలు తిరిగి వచ్చే వరకు ఈ బాటిల్ ఓపెన్ చేయకూడదని గట్టిగా అనుకుంది.
ఈలోగా స్కూల్‌నుంచి పిల్లలు కూడా వచ్చేశారు. వారికి జరిగిన విషయమంతా చెప్పింది ఎలిద్. ఐతే వారు ఏదైన నిధేమో అనుకున్నారు గానీ ఆ బాటిల్‌లోని చూసి వారు కూడా ఆశ్చర్యపోయారు. ఆ బాటిల్‌లోని లేఖను ఓపెన్ చేయాలని తెగా ఆతృత పడ్డారు. అది విక్టోరియా కాలం నాటి పురాతన లేఖ.
ఐతే ఆ బాటిల్ ఓపెన్ కాకపోవడంతో పగలుగొట్టి మరీ ఆ లేఖ తీసి అందులో ఏముందో చూశారు. అందులో జేమ్స్ రిట్చీ, జాన్ గ్రీవ్ అనే ఇద్దరు మగ కార్మికులు సంతకాలు కనిపించాయి. ఈ బాటిల్‌లోని విస్కీ తాము తాగలేదని, అక్టోబర్ 6, 1887 అని రాసి ఉంది. సదరు యజమాని ఆ బాటిల్ ముక్కలను సైతం భద్రపరిచింది. ఐతే నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్కాట్లాండ్ ఆ లేఖను జాగ్రత్తగా భద్రపర్చమని చెప్పింది.
Watch the shocking moment hospital security attends to 'ghost patient' after dying the day before pic.twitter.com/cWyPtCYzjk
— Newspremises (@News_premises) November 21, 2022
(చదవండి: ఘోస్ట్ పేషెంట్‌తో మాట్లాడుతున్న సెక్యూరిటీ గార్డు)
Comments
Please login to add a commentAdd a comment