కెనడాకు చెందిన ఒక మహిళకు 34 సంవత్సరాల క్రితం నాటి ఒక బాటిల్ సముద్రపు ఒడ్డున దొరికింది. ఆ బాటిల్‌లోని ఒక కాగితంలో ఒక మెసేజ్ ఉంది. దానిని చదివిన ఆ మహిళ తెగ ఆశ్చర్యపోయింది. ఆ మెసేజ్ ఆధారంగా ఆ మహిళ ఆ బాటిల్ యజమాని కోసం వెదికింది. అప్పుడు ఆమెకు ఒక విషయం తెలియడంతో నిలువునా వణికిపోయింది.
పురాతన కాలం నాటి వస్తువు ఏదైనా దొరికితే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే ఏదైనా మెసేజ్ లాంటిది ఏదైనా లభ్యమైతే ఇక అప్పుడు కలిగే ఆసక్తికి హద్దులు ఉండవు. కెనడాకు చెందిన ఒక మహిళ విషయంలో ఇదే జరిగింది. షెల్టెర్ అనే మహిళకు సముద్రపు బీచ్‌ను శుభ్రం చేస్తుండగా ఒక వస్తువు దొరికింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
34 ఏళ్లుగా నీటిపై తేలుతున్న బాటిల్
ఆ మహిళ ఒక బాటిల్ ఫొటోను, ఒక మెసేజ్‌ను షేర్ చేసింది. ఆ మెసేస్‌పై 1989, మే 29 తేదీ ఉంది. అంటే ఆ బాటిల్ 34 ఏళ్ల క్రితం నీటిలో పడవేశారు. అది ఇన్నేళ్లుగా నీటిలో కొన్ని వేల మైళ్లు దూరం వరకూ తేలుతూవస్తోంది. షెల్టెర్ ఆ పోస్టులో ఇలా రాసింది.. ‘నాకు ఎప్పటికై నా ఏదైనా పురాతన వస్తువు దొరుకుతుందని తరచూ అనిపించేంది. ఇప్పుడు అది దొరికింది’ అని పేర్కొంది.
బాటిల్‌లో ఏం మెసేజ్ ఉంది?
నిజానికి అ బాటిల్‌లో ప్రత్యేకమైన ఉద్దేశంతో కూడిన ఎటువంటి మెజేస్ లేదు. అయినా దీనిలో ప్రత్యేకత ఉన్నట్లే కనిపిస్తుంది. దానిలో కొన్ని ఏళ్ల క్రితం నాడు రాసిన మెసేజ్ ..‘ఇది ఒక సన్నీ డే, గాలి వీయడం లేదు’ అని ఉంది. ఎవరో వినోదం కోసం ఈ మెసేజ్ రాసి, దానిని బాటిల్‌లో ఉంచి, నీటిలో పడవేశారు. ఏదో ఒకరోజు ఎవరికో ఒకరికి ఈ బాటిల్ లభ్యమవుతుందని వారు భావించివుంటారు.
బాటిల్ యజమాని ఎవరంటే..
షెల్టెర్ తన ఫేస్‌బుక్ పోస్టులో ఒక అప్‌డేట్ కూడా ఇచ్చింది. దానిలో ఆమె తనకు ఈ బాటిల్ యజమాని చిరునామా తెలిసిందని పేర్కొంది. న్యూఫౌండ్‌ల్యాండ్‌కి చెందిన గిల్బర్ట్ హేమలిన్ 1989 మే 29న ఈ బాటిల్‌ను తాను ప్రయాణిస్తున్న బోటు నుంచి సముద్రంలోకి విసిరేశారు. దీనిని పోర్ట్ ఓ చోక్స్‌కు 10 మైళ్ల దూరంలో నీటిలో విసిరివేశారు.
ఆ బాటిల్‌వెనుక భాగంలో ఒక చిరునామా ఉంది. ఆ ప్రాంతం సెయింట్ ఆగస్టాన్ నది, క్యూబెక్‌కు 12 మైళ్ల దూరంలో ఉంది. అక్కడకు వెళ్లిన షెల్టెర్ ఆ బాటిల్ యజమానిని కలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే అతను రెండేళ్ల క్రితమే మృతి చెందారని షెల్టెర్‌కు తెలిసింది. దీంతో ఆమె అతని కుమారునికి ఫోనులో విషయమంతా చెప్పింది. త్వరలోనే ఈ బాటిల్ పంపిస్తానని అతనికి తెలిపింది.
ఇది కూడా చదవండి: చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు
Comments
Please login to add a commentAdd a comment