
టి20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీలంకకు నమీబియా షాక్ ఇచ్చిన ఘటన మరువక ముందే స్కాట్లాండ్ చేతిలో విండీస్ చిత్తు కావడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితేబిదే మ్యాచ్‌లో అంతకుమించి జరిగిన ఒక సంఘటన నవ్వులు పూయిస్తుంది.
స్కాట్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక బుడ్డోడు బౌండరీ ఫెన్సింగ్ వద్దకు వచ్చాడు. దాని మీద నుంచి ఎక్కాలని ప్రయత్నించాడు. కానీ అది ఎత్తుగా ఉండడంతో ఫెన్సింగ్ మీద నుంచి అమాంతం బొక్కా బోర్లా పడ్డాడు. అయితే ఇదంతా గమనించిన తండ్రి పరిగెత్తుకొచ్చేలోపే బుడ్డోడు జారి పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ కింద గడ్డి ఉండడంతో బుడ్డోడికి ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
I hope this toddler is ok.. #T20WorldCup pic.twitter.com/xM38YyJ9GX
— Menners 🎙 (@amenners) October 17, 2022
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 118 పరుగులకే కుప్పకూలింది.స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ మూడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. లీసక్, వీల్ తలా రెండు వికెట్లు, డేవి, షరీఫ్ చెరో వికెట్ సాధించారు. విండీస్ బ్యాటర్లలో జాసన్ హోల్డర్(38 పరుగులు) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు.
ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ మున్సీ(53 బంతుల్లో 66 నటౌట్) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో హోల్డర్, జోసఫ్ చెరో రెండు వికెట్లు సాధించగా.. స్మిత్ ఒక్క వికెట్ సాధించాడు.
చదవండి: గెలిస్తే నిలుస్తారు.. యూఏఈతో అమీతుమీకి సిద్ధమైన శ్రీలంక