T20 World Cup 2021 Ind vs Sco- Player Records Approaching Milestones: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే స్కాట్లాండ్, నమీబియాలతో మ్యాచ్‌లు కీలకంగా మారాయి. ముందుగా నవంబరు 5న దుబాయ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై భారీ తేడాతో విజయం సాధించాలి. ఆ తర్వాత నమీబియాను చిత్తుగా ఓడించాలి. వీటితో పాటు న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్ జయాపజయాలు కూడా టీమిండియా సెమీ ఫైనల్ చేరే మార్గాలను ప్రభావితం చేస్తాయి.
మరి ఇన్ని సమీకరణల నేపథ్యంలో.. వాస్తవం చెప్పాలంటే.. అద్బుతాలు జరిగితే తప్ప కోహ్లి సేన సెమీస్‌కు చేరే అవకాశాలు దాదాపు అసాధ్యం. ఈ విషయం పక్కనపెడితే.. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా, స్కాట్లాండ్ ఆటగాళ్లు పలు వ్యక్తిగత రికార్డులు నమోదు చేసేందుకు ఆస్కారం ఉంది. వాటిని ఓసారి పరిశీలిద్దాం.
విరాట్ కోహ్లి...
బర్త్‌డే బాయ్, టీమిండియా కెప్టెన్.. ‘కింగ్’ విరాట్ కోహ్లి స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో 9 సిక్సర్లు బాదితే... అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 100 సిక్స్‌లు కొట్టిన ఘనత సాధిస్తాడు. భారత ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తర్వాత ఈ రికార్డు నమోదు చేసిన రెండో టీమిండియా క్రికెటర్‌గా నిలుస్తాడు. అంతేకాదు అర్ధ సెంచరీ సాధిస్తే... టీ20 ఫార్మాట్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తర్వాత అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన సారథిగా అవతరిస్తాడు.
రోహిత్ శర్మ 48 పరుగులు చేస్తే..
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 48 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో బ్యాటర్‌గా నిలుస్తాడు. అదే విధంగా... 6 సిక్సర్లు కొడితే... అంతర్జాతీయ క్రికెట్‌లో 450 సిక్స్‌లు బాదిన మూడో క్రికెటర్‌గా ఘనత సాధిస్తాడు.
పాండ్యా, రాహుల్, బుమ్రా.. ఇంకా..
►స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గనుక తుది జట్టులో చోటు దక్కించుకుని... రెండు సిక్సర్లు గనుక బాదితే అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు.
►ఇక కేఎల్ రాహుల్ 3 బౌండరీలు సాధిస్తే... అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 150 బౌండరీలు కొట్టిన క్రికెటర్ అవుతాడు. శార్దూల్ ఠాకూర్ 5 వికెట్లు తీస్తే టీ20 ఫార్మాట్‌లో 150 వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్‌లో చేరతాడు.
►జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొడితే... అంతర్జాతీయ టీ20లలో యజువేంద్ర చహల్ తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలుస్తాడు. ఇక ఇషాన్ కిషన్ గనుక తుది జట్టులో స్థానం పొంది.. ఒక క్యాచ్ అందుకున్నట్లయితే టీ20 క్రికెట్‌లో 50 క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్‌గా నిలుస్తాడు.
స్కాట్లాండ్ ఆటగాళ్లు కూడా..
►స్కాటిష్ క్రికెటర్ జార్జ్ మన్సే ఆరు పరుగులు చేస్తే టీ20 క్రికెట్‌లో 1500 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
►కలం మెక్లాయిడ్ మూడు సిక్సర్లు కొడితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సిక్స్‌లు బాదిన ఘనత సాధిస్తాడు.
చదవండి: టీమిండియాను కచ్చితంగా ఓడిస్తామం: స్కాట్లాండ్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment