మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. 33 పరుగులు చేసిన కేథరీన్ బ్రైస్ టాప్ స్కోరర్‌గా నిలువగా..సారా బ్రైస్ 27, సస్కియా హోర్లీ 13, ఐల్సా లిస్టర్ 11, మెగాన్ మెక్‌కాల్ 10 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నాట్ సీవర్ బ్రంట్, లారెన్ బెల్, చార్లీ డీన్, డేనియెట్ గిబ్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. మయా బౌచియర్ (62), డేనియెల్ వ్యాట్ హాడ్జ్ (51) అజేయ అర్ద సెంచరీలతో ఇంగ్లండ్‌ను గెలిపించారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌కు ఇది వరుసగా మూడో గెలుపు కాగా.. స్కాట్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ గ్రూప్ టాపర్‌గానూ ఎగబాకింది. గ్రూప్-బిలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. స్కాట్లాండ్ సహా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
గ్రూప్-ఏ విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా టాప్‌లో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించింది. భారత్, న్యూజిలాండ్ చెరి నాలుగు పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిచిన పాక్ నాలుగో స్థానంలో ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. రెండు గ్రూప్‌ల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు చేరుతాయన్న విషయం తెలిసిందే.
చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేళ జయవర్దనే
Comments
Please login to add a commentAdd a comment