
స్కాట్లాండ్‌పై విజయంతో జింబాబ్వే తొలిసారి టి20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలో అడుగుపెట్టింది. 15 ఏళ్ల టి20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి సూపర్-12 దశకు చేరుకున్న జింబాబ్వేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోగా.. క్రెయిగ్ ఇర్విన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.ఆరేళ్లుగా ఒక్క ఐసీసీ టోరీ్నలో కూడా ఆడలేకపోయిన జింబాబ్వే ఎట్టకేలకు టి20 ప్రపంచకప్‌లో తమ ముద్ర చూపించింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో చెలరేగి ఈసారి ‘సూపర్ 12’ దశకు అర్హత సాధించింది.
అయితే ఇదే మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు వెస్లీ మాదేవేర స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు బ్యాటర్ మ్యాథ్యూ క్రాస్ ఇచ్చిన క్యాచ్‌ను వెస్లీ మాదవేర అద్భుతంగా అందుకున్నాడు. కళ్లు చెదిరిలో రీతిలో గాల్లోకి అమాంతం ఎగిరి రెండు చేతులో ఒడిసి పట్టాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది. సూపర్ మ్యాన్ క్యాచ్ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. " క్యాచ్ అందుకున్నది సూపర్‌మ్యానా లేక వెస్లీ మాధవేరేనా" అంటూ పోస్టు పెట్టింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా... జింబాబ్వే 18.3 ఓవర్లలో 5 వికెట్లకు 133 పరుగులు సాధించి గెలిచింది. లీగ్ దశలో ఐర్లాండ్‌పై నెగ్గి, ఆ తర్వాత విండీస్ చేతిలో ఓడిన జింబాబ్వే కీలక పోరులో చెలరేగగా, విండీస్‌పై సంచలన విజయంతో టోర్నీని మొదలు పెట్టిన స్కాట్లాండ్ ఆ తర్వాత సాధారణ ప్రదర్శనతో నిష్క్రమించింది.
చదవండి: ఫోటో షేర్ చేసిన ఐసీసీ.. వ్యక్తి ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నలా!
Comments
Please login to add a commentAdd a comment