
టి20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూఫ్-బి క్వాలిఫయర్‌లో జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం గమనార్హం. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో మున్సీ 54 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మెక్ లియోడ్ 25 పరుగులు చేశాడు.
జింబాబ్వే బౌలర్లలో చతరా, నగర్వాలు తలా రెండు వికెట్లు తీయగా.. ముజరబానీ, సికందర్ రాజాలు చెరొక వికెట్ తీశారు. జింబాబ్వే కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కాట్లాండ్ పెద్దగా పరుగులు రాబట్టలేకపోయింది. ఇక జింబాబ్వే, స్కాట్లాండ్‌లకు ఈ మ్యాచ్ కీలకం. ఎవరు గెలిస్తే వారు సూపర్-12కు అర్హత సాధిస్తే.. ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది.
చదవండి: T20 WC 2022: నొప్పితో బాధపడుతుంటే చప్పట్లు కొట్టడం ఏంటి?