Martin Guptill Becomes 2nd Batter To Complete 3000 T20I Runs: అంతర్జాతీయ టీ20ల్లో న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తర్వాత పొట్టి ఫార్మాట్‌లో 3000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా బుధవారం(నవంబర్ 3) పసికూన స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన గప్తిల్(56 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్సర్లు).. 24 పరుగల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలురాయిని చేరుకున్నాడు.
కెరీర్‌లో 105వ అంతర్జాతీయ టీ20 ఆడుతున్న గప్తిల్ 101 ఇన్నింగ్స్‌ల్లో 2 శతకాలు, 18 అర్ధశతకాల సాయంతో 3069 పరుగులు చేయగా.. టీమిండియా సారధి విరాట్ కోహ్లి 92 మ్యాచ్‌ల్లో 52.01 సగటుతో 3225 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(113 మ్యాచ్‌ల్లో 2878 పరుగులు), ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్(92 మ్యాచ్‌ల్లో 2570 పరుగులు), ఆరోన్ ఫించ్(79 మ్యాచ్‌ల్లో 2554 పరుగులు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో 7 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసిన గప్తిల్ ఖాతాలో మరో రెండు రికార్డులు చేరాయి. అంతర్జాతీయ టీ20ల్లో 150 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా, అలాగే న్యూజిలాండ్ తరఫున టీ20 ప్రపంచకప్‌లలో రెండో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గప్తిల్‌కు ముందు బ్రెండన్ మెక్‌కలమ్ 2012 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై 123 పరుగులు చేయగా.. అత్యధిక సిక్సర్ల విభాగంలో గప్తిల్ తర్వాత స్థానంలో టీమిండియా బ్యాటర్ రోహిత్ శర్మ(134 సిక్సర్లు) ఉన్నాడు. కాగా, స్కాట్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
చదవండి: అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు.. వైరలవుతున్న బీసీసీఐ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment