Martin Guptill record
-
రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌ను అధిగమించి రోహిత్ శర్మ అగ్రస్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతోన్న తొలి టీ20లో 64 పరుగులు చేసిన రోహిత్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్(3,443) పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా అత్యదిక పరుగల జాబితాలో.. గుప్టిల్ (3399) రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(3308 పరుగులు), ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్(2894 పరుగులు) నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్(2855 పరుగులు) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: క్రికెట్ గ్రౌండ్లో ఆత్మాహుతి దాడి.. మ్యాచ్ జరుగుతుండగానే..! -
వెస్టిండీస్‌తో తొలి టీ20.. అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..!
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పడు టీ20 సిరీస్‌లో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమైంది. శుక్రవారం(జూలై 29) బ్రియన్ లారా స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తుంది. విండీస్‌తో తొలి టీ20లో రోహిత్ మరో 20 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గుప్తిల్ (3399) పరుగులతో తొలి స్థానంలో ఉండగా, రోహిత్(3379) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక విండీస్‌తో వన్డేలకు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ తిరిగి టీ20 సిరీస్‌తో సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అతడితో పాటు రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ కూడా భారత జట్టులో చేరారు. ఇక కరోనా బారిన పడ్డ కేఎల్ రాహుల్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ , ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: Sanju Samson In T20I Squad: విండీస్‌తో తొలి టి20.. టీమిండియాకు గుడ్‌న్యూస్ -
పసికూనపై మార్టిన్ గప్తిల్ ప్రతాపం.. పలు రికార్డులు సొంతం
Martin Guptill Becomes 2nd Batter To Complete 3000 T20I Runs: అంతర్జాతీయ టీ20ల్లో న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తర్వాత పొట్టి ఫార్మాట్లో 3000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా బుధవారం(నవంబర్ 3) పసికూన స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన గప్తిల్(56 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్సర్లు).. 24 పరుగల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్లో 105వ అంతర్జాతీయ టీ20 ఆడుతున్న గప్తిల్ 101 ఇన్నింగ్స్‌ల్లో 2 శతకాలు, 18 అర్ధశతకాల సాయంతో 3069 పరుగులు చేయగా.. టీమిండియా సారధి విరాట్ కోహ్లి 92 మ్యాచ్‌ల్లో 52.01 సగటుతో 3225 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(113 మ్యాచ్‌ల్లో 2878 పరుగులు), ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్(92 మ్యాచ్‌ల్లో 2570 పరుగులు), ఆరోన్ ఫించ్(79 మ్యాచ్‌ల్లో 2554 పరుగులు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో 7 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసిన గప్తిల్ ఖాతాలో మరో రెండు రికార్డులు చేరాయి. అంతర్జాతీయ టీ20ల్లో 150 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా, అలాగే న్యూజిలాండ్ తరఫున టీ20 ప్రపంచకప్‌లలో రెండో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గప్తిల్‌కు ముందు బ్రెండన్ మెక్‌కలమ్ 2012 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై 123 పరుగులు చేయగా.. అత్యధిక సిక్సర్ల విభాగంలో గప్తిల్ తర్వాత స్థానంలో టీమిండియా బ్యాటర్ రోహిత్ శర్మ(134 సిక్సర్లు) ఉన్నాడు. కాగా, స్కాట్లాండ్తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చదవండి: అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు.. వైరలవుతున్న బీసీసీఐ ట్వీట్ -
30 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు
క్రైస్ట్‌చర్చ్: ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో లంకను చిత్తుగా ఓడించింది. పేరుకు వన్డే మ్యాచ్ అయినా కివీస్ ఆటగాళ్ల విజృంభణతో టి20లా సాగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 27.4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్ల ధాటికి లంక ఆటగాళ్లు పెవిలియన్ కు వరుస కట్టారు. కులశేఖర(19) టాప్ స్కోరర్ గా నిలిచాడు. హెన్రీ 4, మెక్ క్లీనగహన్ 3 వికెట్లు పడగొట్టారు. బ్రాస్ వెల్, సోధి చెరో వికెట్ దక్కించుకున్నారు. 118 పరుగుల టార్గెట్ ను న్యూజిలాండ్ కేవలం 8.2 ఓవర్లలో చేరుకుంది. గప్టిల్ సునామీ ఇన్నింగ్స్ తో పది ఓవర్లలోపే కివీస్ లక్ష్యాన్ని చేరుకుంది. లంక బౌలర్లను ఎడాపెడా బాదుతూ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 93 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 17 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధసెంచరీ పూర్తిచేశాడు. వన్డేల్లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఓవరాల్ గా జయసూర్య, పెరీరాతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టి ఏబీ డివిలియర్స్ వీళ్ల కంటే ముందున్నాడు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ పలు ఘనతలు సాధించింది. 16 బంతుల్లో కివీస్ 50 పరుగులు చేసింది. అంతకుముందు 2007లో బంగ్లాదేశ్ పై 21 బంతుల్లో 50 పరుగులు సాధించింది. కివీస్ కు ఇది రెండో బెస్ట్ ఛేజింగ్ రన్ రేట్ 14.16. అంతకుముందు ఇది 15.83గా ఉంది. న్యూజిలాండ్ పై శ్రీలంక 117 కంటే తక్కువ స్కోర్లు రెండుసార్లు నమోదు చేసింది. గతంలో 112, 115 పరుగుల స్వల్పస్కోర్లు సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. గప్టిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.