
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌ను అధిగమించి రోహిత్ శర్మ అగ్రస్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతోన్న తొలి టీ20లో 64 పరుగులు చేసిన రోహిత్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్(3,443) పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.
ఇక ఓవరాల్‌గా అత్యదిక పరుగల జాబితాలో.. గుప్టిల్ (3399) రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(3308 పరుగులు), ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్(2894 పరుగులు) నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్(2855 పరుగులు) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: క్రికెట్ గ్రౌండ్‌లో ఆత్మాహుతి దాడి.. మ్యాచ్ జరుగుతుండగానే..!
Comments
Please login to add a commentAdd a comment