
వివిధ దేశాల ప్రతినిధులతో ఎంపీ మిథున్‌రెడ్డి
పీలేరు(చిత్తూరు జిల్లా): ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను కాపాడి, తద్వారా ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సూచించారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో స్కాట్లాండ్‌లో శుక్రవారం నిర్వహించిన గ్లాస్గో సదస్సులో మిథున్‌రెడ్డి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కరోనా వ్యాప్తికి ముందు, తరువాత ప్రపంచంలో జరిగిన మార్పులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాలని కోరారు.