ఎడిన్‌బర్గ్ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కంగారులు ఊదిపడేశారు. కేవలం 9.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఆసీస్ చేధించింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 25 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెడ్.. 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 39; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు.
దక్షిణాఫ్రికా వరల్డ్ రికార్డు బద్దలు..
ఇక ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి ఏకంగా 113 పరుగులు చేసింది. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టు ఆసీస్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది.
గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో సఫారీలు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 102 పరుగులు చేశారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో ప్రోటీస్ ఆల్‌టైమ్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment