
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టను స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్‌లో స్కాట్లాండ్ జట్టుకు రిచీ బెరింగ్టన్ సారధ్యం వహించనున్నాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2021 స్కాట్లాండ్ జట్టులో భాగంగా ఉన్న జోష్ డేవి, వీల్ ఈ ఏడాది మెగా ఈవెంట్‌కు కూడా ఎంపికయ్యారు.
కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన స్కాట్లాండ్.. సూపర్-12 అర్హత సాధించింది. సూపర్-12లో కూడా స్కాట్లాండ్ పర్వాలేదనిపించింది. ఇక ఈ ఏడాది మెగా ఈవెంట్‌లో స్కాట్లాండ్.. ఐర్లాండ్, వెస్టిండీస్,జింబాబ్వేతో గ్రూప్ దశలో తలపడనుంది.
టీ20 ప్రపంచకప్‌కు స్కాట్లాండ్ జట్టు: రిచర్డ్ బెర్రింగ్టన్ (కెప్టెన్), మైఖేల్ లీస్క్, జార్జ్ మున్సే, బ్రాడ్లీ వీల్, క్రిస్ సోల్, క్రిస్ గ్రీవ్స్, సఫ్యాన్ షరీఫ్, జోష్ డేవీ, మాథ్యూ క్రాస్, హంజా తాహిర్, కాలమ్ మెక్‌లియోడ్, మార్క్‌లెన్ ఎమ్‌గ్రాడ్, మార్క్‌లెన్ వాక్‌మ్రాడ్, వాలెస్, మైఖేల్ జోన్స్
చదవండి: Ind vs Aus: మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.. మీ జీవితం బాగు చేసుకోండి! భువీ భార్య కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment