స్కాట్లాండ్‌పై పాకిస్తాన్ ఘన విజయం
సమయం: 22:58.. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తన హవాను కొనసాగిస్తుంది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 72 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కాట్లాండ్ బ్యాటర్స్‌లో రిచీ బెరింగ్టన్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో షాబాద్ ఖాన్ 2, హసన్ అలీ, హారిస్ రౌఫ్, తాహిర్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ సీనియర్ బ్యాటర్ షోయబ్ మాలిక్ సిక్సర్ల వర్షం కురిపించడంతో 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 189 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ విజయంతో సూపర్ 12లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి గ్రూఫ్ టాపర్‌గా సెమీస్‌కు చేరుకుంది. ఇక సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో అమితుమీకి సిద్ధమవుతుంది.
సమయం: 22:45..190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో 14 పరుగులు చేసిన లీస్క్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి స్కాట్లాండ్ 5 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. రిచీ బెరింగ్టన్ 31, క్రిస్ గ్రీవ్స్ 0 పరుగులతో ఆడుతున్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్ .. 41/4
190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. షాబాద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో స్కాట్లాండ్ వరుసగా రెండో వికెట్లు కోల్పోయింది. అంతకముందు ఇమాద్ వసీమ్ బౌలింగ్‌లో 5 పరుగులు చేసిన మున్సే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక 9 పరుగులు చేసిన కొయట్జెర్ హసన్ అలీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం స్కాట్లాండ్ 11 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్.. 23/1
190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన కొయట్జెర్ హసన్ అలీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం స్కాట్లాండ్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. జార్జ్ మున్సీ 11, మాథ్యూ క్రాస్ 0 పరుగులతో ఆడుతున్నారు
షోయబ్ మాలిక్ సిక్సర్ల వర్షం.. పాకిస్తాన్ 189/4.. స్కాట్లాండ్ టార్గెట్ 190
సమయం: 21:10.. పాకిస్తాన్ సీనియర్ బ్యాటర్ షోయబ్ మాలిక్ సిక్సర్ల వర్షం కురిపించడంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 189 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 18 బంతుల్లోనే 6 సిక్సర్లు.. ఒక ఫోర్‌తో 54 పరుగులు చేసిన మాలిక్ ఈ టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తరపున వేగవంతమైన అర్థశతకం సాధించాడు. కాగా మాలిక్ చివరి ఓవర్‌లో 3 సిక్సర్లు.. ఒక ఫోర్ మొత్తంగా 26 పరుగులు పిండుకున్నాడు. మిగతావారిలో బాబర్ అజమ్ 66 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మహ్మద్ హఫీజ్ 31 పరుగులు చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ గ్రేవిస్ 2, హంజా తాహిర్, సత్యాన్ షరీఫ్ చెరో వికెట్ తీశారు.
మూడో వికెట్ కోల్పోయిన పాక్.. హఫీజ్(31) ఔట్
సమయం 20:39.. వరుసగా రెండు బౌండరీలు బాది జోరుమీదున్న మహ్మద్ హఫీజ్(19 బంతుల్లో 31; 4 ఫోర్లు, సిక్స్) మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. 15వ ఓవర్ ఆఖరి బంతికి సాఫ్యాన్ షరీఫ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 112/3. క్రీజ్లో బాబర్ ఆజమ్(49), షోయబ్ మాలిక్ ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన పాక్.. ఫఖర్ జమాన్(8) ఔట్
సమయం 20:15.. ఇన్నింగ్స్ 10 వ ఓవర్లో పాక్‌కు మరో షాక్ తగిలింది. క్రిస్ గ్రీవ్స్ బౌలింగ్‌లో లీస్క్‌కు క్యాచ్ ఇచ్చి ఫఖర్ జమాన్(13 బంతుల్లో 8) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 60/2. క్రీజ్లో బాబర్ ఆజమ్(30), మహ్మద్ హఫీజ్(1) ఉన్నారు.
సమయం: 20:11.. 8 ఓవర్ల ఆట ముగిసేసరికి పాకిస్తాన్ వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. బాబర్ అజమ్ 22, ఫఖర్ జమాన్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 15 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్ హంజా తాహిర్ బౌలింగ్‌లో మాథ్యూ క్రాస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
5 ఓవర్లలో పాకిస్తాన్ 32/0
సమయం: 19:52.. స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ధాటిగా ఆడుతోంది. ఓపెనర్లు రిజ్వాన్(12), బాబర్ అజమ్(16) నిలకడగా ఆడుతుండడంతో 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది.
షార్జా: టి20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ నామమాత్రం అయినప్పటికీ సూపర్-12 దశలో ఒక్కమ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్‌కు వెళ్లాలని పాకిస్తాన్ భావిస్తోంది. మరోవైపు స్కాట్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. పాక్‌లాంటి పటిష్టమైన జట్టుపై స్కాట్లాండ్ ఏ మేరకు పోరాడుతుందో చూడాలి. ఇక ముఖాముఖి పోరులో స్కాట్లాండ్‌పై తలపడిన మూడుసార్లు పాకిస్తాన్‌నే విజయం వరించింది.
స్కాట్లాండ్ : జార్జ్ మున్సే, కైల్ కోయెట్జర్(కెప్టెన్), మాథ్యూ క్రాస్(వికెట్ కీపర్), రిచీ బెరింగ్టన్, డైలాన్ బడ్జ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, హంజా తాహిర్, సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లీ వీల్
పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ అజమ్(కెప్టెన్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసిం, హసన్ అలీ, హారిస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
Comments
Please login to add a commentAdd a comment