ప్రతిష్టాత్మక ‘యూరో’ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు నేడు తెర లేవనుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి గం. 12:30 నుంచి మ్యూనిక్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జర్మనీ జట్టుతో స్కాట్లాండ్ పోటీపడుతుంది. జర్మనీలోని 10 పట్టణాల్లో జరిగే ఈ టోర్నీ జూలై 14న బెర్లిన్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. 2020 యూరో టోర్నీలో ఇటలీ జట్టు విజేతగా నిలిచింది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు.
గ్రూప్ ‘ఎ’లో జర్మనీ, స్కాట్లాండ్, హంగేరి, స్విట్జర్లాండ్... గ్రూప్ ‘బి’లో స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ, అల్బేనియా... గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, స్లొవేనియా, సెర్బియా... గ్రూప్ ‘డి’లో నెదర్లాండ్స్, పోలాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా... గ్రూప్ ‘ఇ’లో బెల్జియం, స్లొవేకియా, రొమేనియా, ఉక్రెయిన్... గ్రూప్ ‘ఎఫ్’లో పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, జార్జియా, టర్కీ జట్లు ఉన్నాయి.
లీగ్ దశ ముగిశాక ఆరు గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 12 జట్లు... మూడో స్థానంలో నిలిచిన నాలుగు ఉత్తమ జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. ‘యూరో’ టోర్నీని భారత్‌లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment