టీమిండియాను కచ్చితంగా ఓడిస్తాం: స్కాట్లాండ్ కెప్టెన్ | Kyle Coetzer invites Virat Kohli to Scotlands dressing room | Sakshi
Sakshi News home page

టీమిండియాను కచ్చితంగా ఓడిస్తామం: స్కాట్లాండ్ కెప్టెన్

Published Thu, Nov 4 2021 5:16 PM | Last Updated on Fri, Nov 5 2021 12:19 PM

Kyle Coetzer invites Virat Kohli to Scotlands dressing room - Sakshi

Kyle Coetzer Comments on Virat kohli: విరాట్‌ కోహ్లి, కేన్‌ విలియమ్సన్‌, బాబర్ అజామ్ వంటి స్టార్‌ కెప్టెన్‌ల నుంచి తమ జట్టు ఆటగాళ్లు చాలా నేర్చుకోవాలని స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కోయెట్జర్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో నవంబర్‌5న స్కాట్లాండ్‌తో తలపడనుంది. ఈ సందర్బంగా కోహ్లి తమ ఆటగాళ్లతో మాట్లాడి వారిలో స్ఫూర్తి నింపాలని అతడు కోరాడు.

"కోహ్లి , విలియమ్సన్‌,రషీద్ ఖాన్ వంటి స్టార్‌ ఆటగాళ్లతో   మా ఆటగాళ్లు మాట్లాడాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ల నుంచి మా బాయ్స్‌ చాలా విషయాలు నేర్చుకోవాలి. మా జట్టుకు ఈ టోర్నమెంట్‌లో చాలా అనుభవం కలిగింది. భారత్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌,బంగ్లాదేశ్‌ వంటి జట్లతో ఆడడం మాకు ఓ ఆద్బుతమైన అవకాశం. ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లతో ఆడడం మాకు ఒక మంచి అనుభవం కలిగింది. 

టాస్‌ సమయంలో  విరాట్ కోహ్లి పక్కన నిలబడడం నాకే కాదు ఎవరికైనా ప్రత్యేక సందర్భం. అదే విధంగా కేన్ విలియమ్సన్‌ సారథ్యంలోని న్యూజిలాండ్‌ జట్టుతో తలపడడం అదృష్టంగా భావించాను. మేము తదుపరి మ్యాచ్‌లో కష్టపడి ఆడి  టీమిండియాను ఓడించాలి అనుకుంటున్నాము. ఇది ఒక కఠినమైన సవాలు అని మాకు తెలుసు. అయితే మనపై మనకు నమ్మకం ఎప్పుడూ పోకూడదు" అని  కైల్ కోయెట్జర్ పేర్కొన్నాడు..

చదవండి: ICC Player Of The Month: షకీబ్‌, ఆసిఫ్‌, డేవిడ్‌.. టీమిండియా ఆటగాళ్లు ఒక్కరూ లేరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement