మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దుబాయ్ వేదికగా పాక్-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిప్పులు చేరిగారు. భారత బౌలర్ల దాటికి పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులకే పరిమితమైంది.
భారత బౌలర్లలో పేసర్ అరుంధతి రెడ్డి మూడు వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్ రెండు, రేణుకా, దీప్తి శర్మ, ఆశా తలా వికెట్ సాధించారు. అయితే బౌలింగ్‌లో అదరగొట్టిన భారత జట్టు.. ఫీల్డింగ్‌లో మాత్ర కాస్త నిరాశపరిచింది. ముఖ్యంగా భారత స్పిన్నర్ ఆశా శోభన రెండు ఈజీ క్యాచ్‌లను జారవిడిచింది.
అలియా రియాక్షన్ వైరల్
తొలుత పాక్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసిన అరుంధతి రెడ్డి రెండో బంతిని మునీబా అలీకి ఫుల్ డెలివరీగా సంధించింది. అయితే ఆ డెలివరీని మునీబా షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డర్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించింది. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న ఆశా చేతికి బంతి వెళ్లింది.
కానీ ఆశా మాత్రం సునాయస క్యాచ్‌ను జారవిడిచింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. పాక్ ఆటగాళ్లు సైతం ఆ క్యాచ్ డ్రాప్‌ను చూసి ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో డౌగౌట్‌లో ఉన్న పాక్ ఆల్‌రౌండర్ అలియా రియాజ్ గోల్డెన్ రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత మరో ఈజీ క్యాచ్‌ను కూడా శోభన విడిచిపెట్టింది.
— Cricket Cricket (@cricket543210) October 6, 2024
Comments
Please login to add a commentAdd a comment