మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-ఏలో ఇవాళ (అక్టోబర్ 14) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. సెమీస్ బెర్తే లక్ష్యంగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నష్రా సంధు మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను దెబ్బతీసింది. ఒమైమా సొహైల్, నిదా దార్, సదియా ఇక్బాల్ తలో వికెట్ పడగొట్టారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో సుజీ బేట్స్ 28, జార్జియా ప్లిమ్మర్ 17, అమేలియా కెర్ 9, సోఫి డివైన్ 19, బ్రూక్ హ్యాలీడే 22, మ్యాడీ గ్రీన్ 9, ఇసబెల్లా గేజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్ గెలుపోటములపై టీమిండియా భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓ మోస్తరు విజయం సాధిస్తే భారత్ సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ పాక్ న్యూజిలాండ్‌ను భారీ తేడాతో ఓడిస్తే పాకిస్తానే సెమీస్‌కు చేరుకుంటుంది. న్యూజిలాండ్ గనక పాక్‌ను చిత్తు చేస్తే భారత్, పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకుంటుంది. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment