మహిళల టి20 ప్రపంచకప్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు ఆ్రస్టేలియానే. అంతలా పొట్టి ప్రపంచకప్‌లో దుర్బేధ్యమైన జట్టుగా ప్రత్యర్థుల్ని హడలెత్తిస్తోంది. ఆరు టైటిళ్లతో అరుదైన ముద్ర వేసుకుంది. ఇప్పుడు తాజా మెగా ఈవెంట్‌లోనూ తమకు షరామామూలైన ఫైనల్ బెర్త్‌ను సాధించే పనిలో ఉంది.
గురువారం దక్షిణాఫ్రికాతో తొలి సెమీఫైనల్ సమరానికి సిద్ధమైంది. ఇందులో చిత్రమేమిటంటే ఈ మెగా ఈవెంట్ చరిత్రలోనే కేవలం ఒక్కసారి ఫైనల్ చేరిన జట్టు... ఒకే ఒక్కసారి మాత్రమే టైటిల్ పోరుకు అర్హత సాధించని హాట్ ఫేవరెట్ ఆ్రస్టేలియాను ‘ఢీ’కొట్టబోతోంది
మహిళల టి20 ప్రపంచకప్ 2009లో మొదలైతే... ఆ ప్రథమ టైటిల్ పోరుకు మాత్రమే ఆ్రస్టేలియా అర్హత సాధించలేదు. తర్వాత జరిగిన ఏడు ప్రపంచకప్‌లలోనూ వరుసబెట్టి తుదిపోరుకు చేరిన కంగారూ జట్టు ప్రత్యర్థుల్ని కంగారు పెట్టించి మరీ ఆరు టైటిళ్లను సాధించింది.
ఇందులో రెండుసార్లు (2010, 2012, 2014; 2018, 2020, 2023) ‘హ్యాట్రిక్’ టైటిల్స్ ఉండటం మరో విశేషం. గత మెగా ఈవెంట్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకుంటే సొంతగడ్డపై కూడా సఫారీకి ఓటమి తప్పలేదు. తాజా టోర్నీలోలో ఇరుజట్లు సెమీస్‌లో తలపడుతుండటంతో గత పరాభవానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో సఫారీ అమ్మాయిలు ఉన్నారు.
కానీ ఈ టోరీ్నలో అజేయంగా దూసుకెళ్తున్న ఫేవరెట్‌ను ఓడించడం అంతసులువు కానేకాదని దక్షిణాఫ్రికా శిబిరానికి బాగా తెలుసు. దీనికి తగిన ఎత్తుగడలతో బరిలోకి దిగాలని చూస్తోంది. మరోవైపు గత ప్రపంచకప్ ఆడిన 11 మందిలో ఒక్క మెగ్ లానింగ్ (రిటైర్డ్) మినహా మిగతా పది మంది కూడా అందుబాటులో ఉండటం జట్టుకు లాభించే అంశం.
ఆసీస్ అంటేనే ఆల్‌రౌండ్ జట్టు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. అమ్మాయిలంతా ఫామ్‌లో ఉండటంతో ఆసీస్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment