అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్‌ అదే: మంధాన | Mandhana defends sluggish batting Agianst pakistan | Sakshi
Sakshi News home page

అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్‌ అదే: మంధాన

Published Mon, Oct 7 2024 5:38 PM | Last Updated on Mon, Oct 7 2024 6:38 PM

Mandhana defends sluggish batting Agianst pakistan

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో భాగంగా దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో భార‌త్ మ‌ట్టిక‌రిపించింది. దీంతో త‌మ సెమీస్ ఆశ‌ల‌ను భార‌త జ‌ట్టు స‌జీవంగా ఉంచుకుంది. ప్ర‌స్తుతం టీమిండియా గ్రూపు-ఎ నుంచి పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్ధానంలో కొన‌సాగుతోంది. అయితే భార‌త ర‌న్‌రేట్(-1.217) ఇంకా మైన‌స్‌లోనే ఉంది. భార‌త్ కంటే ముందు పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి.

భారీ విజ‌యం సాధించి ఉంటే?
అయితే పాక్‌పై భార‌త జ‌ట్టు భారీ విజ‌యం సాధించి ఉంటే  పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్ధానానికి చేరి ఉండేది. కానీ 106 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని చేధించేందుకు హ‌ర్మాన్ సేన తీవ్రంగా చెమటోడ్చింది. ఈ లో టార్గెట్‌ను ఛేజ్ చేసందుకుందు భారత్ ఏకంగా 18.5 ఓవర్లు తీసుకుంది.

దీంతో ఉమెన్ ఇన్ బ్లూ ఖాతాలో రెండు పాయింట్లు చేరినప్పటకి..  రన్‌రేట్ మాత్రం పెద్దగా మెరుగు పడలేదు. అయితే  పాక్‌పై గెలిచినప్పటకి భారత్ సెమీస్ ఆశలు ఇంకా సంక్లిష్టంగానే ఉన్నాయి. అక్టోబర్ 9న దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా భారీ విజయం సాధించాలి.

లంకపై కూడా సాధారణ విజయం సాధిస్తే భారత్ సెమీస్ ఆశలు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పదు. ఒక వేళ అదే జరిగితే భారత్‌ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో చావో రేవో తెల్చుకోవాల్సిందే. అయితే మంగళవారం ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధిస్తే భారత్‌కు కొంత ఉపశమనం కలుగుతుంది.

అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం
ఇక పాక్‌పై తమ బ్యాటింగ్ విధాన్ని భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సమర్థించింది. నేను, షఫాలీ బాల్‌ను సరిగ్గా టైం చేయలేకపోయాము. పిచ్ కాస్త స్లోగా ఉంది. మేము ఎక్కువగా వికెట్లు కోల్పోవాలని అనుకోలేదు. అందుకే స్లోగా ఆడాము. నెట్ రన్‌రేట్ కూడా మా ఆలోచనలో ఉంది.

 తర్వాతి మ్యాచ్‌ల్లో మేము మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాము. సెమీస్‌కు ఆర్హతసాధించడమే మా లక్ష్యం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో మంధాన పేర్కొంది. కాగా ఈ మ్యాచ్‌లో మంధాన కేవలం 7 పరుగులు మాత్రమే చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement