మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భారత జట్టు బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో సెమీస్ ఆశలను ఉమెన్ ఇన్ బ్లూ సజీవంగా ఉంచుకుంది.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్ధేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్మన్ ప్రీత్ కౌర్( 29 రిటైర్డ్ హార్ట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సానా రెండు వికెట్లు పడగొట్టగా.. ఇక్బాల్, సోహైల్ తలా వికెట్ సాధించారు.
నిప్పులు చేరిగిన అరుంధతి..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నామమాత్రమే స్కోర్‌కే పరిమితమైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పాక్ 105 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పేసర్ అరుంధతి రెడ్డి మూడు వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్ రెండు, రేణుకా, దీప్తి శర్మ, ఆశా తలా వికెట్ సాధించారు.
పాక్ బ్యాటర్లలో నిధా ధార్(28) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో బంతితో అద్భుత ప్రదర్శన కనబరిచిన అరుంధతికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 9న దుబాయ్ వేదికగా శ్రీలంకతో తలపడనుంది.
చదవండి: T20 WC: ఈజీ క్యాచ్ డ్రాప్.. పాక్ ప్లేయర్ గోల్డెన్ రియాక్షన్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment