![Richa Ghosh's Stunning One-Handed Catch Sends Fatima Sana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/10/6/WhatsApp%20Image%202024-10-06%20at%2017.20.52.jpeg.webp?itok=p_H1JKXd)
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ సంచలన క్యాచ్‌తో మెరిసింది. కళ్లు చెదిరే క్యాచ్‌తో పాక్ కెప్టెన్ ఫాతిమా సానాను రిచా పెవిలియ్‌నకు పంపింది. పాక్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన ఆశా శోభన ఐదో బంతిని ఫాతిమాకు లూపీ డెలివరీగా సంధించింది.
అప్పటికే స్వీప్ ఆడి వరుసగా రెండు బౌండరీలు బాదిన ఫాతిమా.. ఆ డెలివరీని కూడా స్లాగ్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించింది. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని వైడ్ ఔట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ రిచా తన కుడివైపు పక్షిలా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది.
దీంతో పాక్ కెప్టెన్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు శెభాష్ రిచా అని కామెంట్లు చేస్తున్నారు. కాగా రిచాను అభిమానులు ముద్దుగా లేడి ధోని అని పిలుచుకుంటున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పాక్ 105 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పేసర్ అరుంధతి రెడ్డి మూడు వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్ రెండు, రేణుకా, దీప్తి శర్మ, ఆశా తలా వికెట్ సాధించారు. పాక్ బ్యాటర్లలో నిధా ధార్(28) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
చదవండి: సురేష్ రైనా సిక్సర్ల వర్షం.. దద్దరిల్లిన మైదానం(వీడియో)
— Cricket Cricket (@cricket543210) October 6, 2024
Comments
Please login to add a commentAdd a comment