కష్టాల్లో పాకిస్తాన్‌.. 72 పరుగులకే 7 వికెట్లు | T20 World Cup 2024: IND W vs PAK W Match live Updates | Sakshi
Sakshi News home page

T20 WC 2024: కష్టాల్లో పాకిస్తాన్‌.. 72 పరుగులకే 7 వికెట్లు

Published Sun, Oct 6 2024 3:07 PM | Last Updated on Sun, Oct 6 2024 4:51 PM

T20 World Cup 2024: IND W vs PAK W Match live Updates

IND W vs PAK W Match live Updates: 

16 ఓవర్లకు పాక్‌ స్కోర్‌: 76/7
16 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజులో నిధా ధార్‌(19), సైదా ఆరోబ్‌(3) పరుగులతో ఉన్నారు.

ఐదో వికెట్‌ డౌన్‌..
పాకిస్తాన్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రియాజ్‌.. అరుందతి రెడ్డి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. 12.1 ఓవర్లకు పాక్‌ స్కోర్‌: 52/5

కష్టాల్లో పాకిస్తాన్‌.. 44 పరుగులకే 4 వికెట్లు
పాక్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. భారత బౌలర్ల దాటికి పాక్‌ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 11 ఓవర్లకు పాక్‌ స్కోర్‌: 47/4. క్రీజులో రియాజ్‌(1), నిదా(11) పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్‌ డౌన్‌..
పాకిస్తాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన సొహైల్‌.. అరుంధతి రెడ్డి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. క్రీజులో నిదా ధార్‌ వచ్చింది. 8 ఓవర్లకు పాక్‌ స్కోర్‌: 35/3. క్రీజులో మునీబా అలీ(16), దార్‌(2) పరుగులతో ఉన్నారు.

పాక్‌ రెండో వికెట్‌ డౌన్‌..
25 ప‌రుగుల వ‌ద్ద పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 8 ప‌రుగులు చేసిన‌ సిద్రా అమీన్.. దీప్తి శ‌ర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. క్రీజులోకి సొహైల్‌ వ‌చ్చింది.

తొలి వికెట్‌ కోల్పోయిన పాక్‌.. 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది. ఓపెనర్‌ గుల్‌ ఫిరోజాను రేణుకా సింగ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసింది. క్రీజులోకి అమీన్‌ వచ్చింది. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌..
మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా దుబాయ్‌ వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాక్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాయాదితో పోరులో భారత జట్టు ఒకే మార్పుతో బరిలోకి దిగింది. 

ఈ మ్యాచ్‌కు స్టార్‌ ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ దూరమైంది. ఆమె స్ధానంలో సజన తుది జట్టులోకి వచ్చింది. మరోవైపు పాక్‌ కూడా ఓ మార్పుతో ఆడనుంది. డానియా బ్యాగ్‌ స్దానంలో ఆరోబాకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కింది.

తుది జట్లు
భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి,  సజన, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్

పాకిస్తాన్‌: మునీబా అలీ(వికెట్‌ కీపర్‌), గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా(కెప్టెన్‌), తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా, సాదియా ఇక్బాల్

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement