మహిళల టీ20 ప్రపంచకప్-2024లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం దుబాయ్ వేదికగా శ్రీలంక మహిళల జట్టుతో టీమిండియా తలపడనుంది. తమ సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా విజయం సాధించాలి. భారీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్ధానానికి చేరుకునే అవకాశం ఉంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఈ కీలక పోరుకు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ అందుబాటులో ఉండనుంది. ఆదివారం పాకిస్తాన్ జరిగిన మ్యాచ్‌లో కౌర్ గాయపడింది. మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో హర్మాన్ మెడకు గాయమైంది. దీంతో ఆమె 29 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగింది.
ఆ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా భారత సారథి పాల్గోనలేదు. దీంతో హర్మాన్ శ్రీలంకతో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆమె అందుబాటుపై భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన క్లారిటీ ఇచ్చింది. హర్మాన్ గాయం అంత తీవ్రమైనది కాదని, ఆమె శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నట్లు మంధాన తెలిపింది.
మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేదని, లంకతో మ్యాచ్‌కూ దూరమయ్యే అవకాశముందని స్మృతి ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొంది. పాక్‌పై ఆడిన భారత జట్టునే లంకతో మ్యాచ్‌కూ కొనసాగించే ఛాన్స్ ఉంది. కాగా పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం మూడో స్ధానంలో ఉంది. భారత్ కంటే ముందు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment