మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా న్యూజిలాండ్ అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో చిత్తు చేసిన న్యూజిలాండ్ మహిళల జట్టు.. తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది.
గత 15 ఏళ్లగా ఊరిస్తున్న పొట్టివరల్డ్‌కప్ టైటిల్‌ను ఎట్టకేలకు వైట్ ఫెర్న్స్ తమ సొంతం చేసుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా తలరాత మారలేదు. పురుషుల జట్టు మాదిరిగానే మరోసారి సౌతాఫ్రికా అమ్మాయిలు కూడా ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు.
తొలిసారి వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడాలనుకున్న దక్షిణాఫ్రికా కల మాత్రం నేరవేరలేదు. ఏదమైనప్పటి అద్బుత పోరాటంతో ఫైనల్ వరకు వచ్చిన సౌతాఫ్రికాపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక టీ20 వరల్డ్‌కప్-2024 ముగిసిన నేపథ్యంలో విజేత, రన్నరప్ సహా ఈ టోర్నీలో పాల్గొన్న జట్లకు ఎంత మేర ప్రైజ్ మనీ దక్కిందన్న అంశాన్ని పరిశీలిద్దాం.
విజేతకు ఎంతంటే?
అయితే ఐసీసీ ఈ ప్రపంచకప్ నుంచి పురుషులు, మహిళల ప్రైజ్ మనీ సమానంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఛాంపియన్ న్యూజిలాండ్‌కు 2.34 మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ.19.67 కోట్లు) బహుమతి లభించింది.
►అదే విధంగా గ్రూపు దశలో నాలుగింటికి మూడు మ్యాచ్‌లు గెలిచిన డివైన్ బృందానికి ఛాంపియన్‌గా అందుకున్న మొత్తంతో పాటు అదనంగా రూ. 78 లక్షలు ముట్టింది. అంటే న్యూజిలాండ్ మొత్తంగా ప్రైజ్‌మనీ రూపంలో రూ.20.45 కోట్లు దక్కనుంది.
గ్రూప్ దశలో ఒక మ్యాచ్ గెలిచిన ప్రతి జట్టుకు రూ. 26.19 లక్షల నగదు బహుమతి అందింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌కు భారీగా ప్రైజ్ మనీ లభించింది.
రన్నరప్‌కు ఎంతంటే?
►రన్నరప్ దక్షిణాఫ్రికాకు 1.17 మిలియన్ డాలర్లు (రూ. 9. 83 కోట్లు). అంతేకాకుండా లీగ్ స్టేజీలో 3 మ్యాచ్‌లు గెలిచిన సౌతాఫ్రికాకు రూ. 78 లక్షలు ఇందుకు అదనంగా లభించాయి. దీంతో మొత్తంగా సూమారు రూ.10.62 కోట్ల నగదు బహుమతిని దక్షిణాఫ్రికా అమ్మాయిలు అందుకున్నారు.
సెమీస్ చేరిన జట్లకు ఎంత ముట్టిందంటే?
►గ్రూపు-ఎ నుంచి ఆస్ట్రేలియా, గ్రూపు-బి నుంచి వెస్టిండీస్ సెమీ ఫైనలిస్టులుగా అందుకున్న మొత్తం చెరో 5.67 కోట్ల రూపాయలు.
►ఇక లీగ్ స్టేజీలో నాలుగింటికి 4 మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్‌కు అదనంగా దక్కిన మొత్తం 1.4 కోట్ల రూపాయలు.
►అదే విధంగా గ్రూపు స్టేజిలో మూడు మ్యాచ్‌లు గెలిచిన విండీస్‌కు కు దక్కిన మొత్తం...రూ. 78 లక్షలు.
►ఇక గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన భారత్‌కు కేవలం రూ. 52 లక్షలు మాత్రమే దక్కింది. ఎందుకంటే లీగ్ స్టేజీలో భారత్ కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment