తండ్రి ఆకస్మిక మరణంతో పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా టీ20 ప్రపంచకప్-2024 నుంచి వైదొలిగింది. 22 ఏళ్ల ఫాతిమా వరల్డ్‌కప్‌లో పాక్ తదుపరి ఆడబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉండదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ఫాతిమా ఇవాళే స్వదేశానికి పయనమైనట్లు పీసీబీ తెలిపింది.
ఫాతిమా గైర్హాజరీలో వైస్ కెప్టెన్ మునీబా అలీ పాక్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు పీసీబీ పేర్కొంది. పాక్ రేపు (అక్టోబర్ 11) డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ప్రపంచకప్‌లో పాక్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి ఓడి (భారత్ చేతిలో), ఒక దాంట్లో (శీలంకపై) గెలిచింది.
పాక్ ప్రస్తుతం గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, భారత్ టాప్-2లో ఉండగా.. న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉంది. గ్రూప్-ఏలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
పాక్ సెమీస్ రేసులో నిలవాలంటే తదుపరి ఆసీస్‌తో జరుగబోయే మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరుగబోయే మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంటుంది. పాక్ అక్టోబర్ 14న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ సమయానికి రెగ్యులర్ కెప్టెన్ ఫాతిమా సనా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఫాతిమా సనా ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మంచి ఫామ్‌లో ఉంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆమె మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఫాతిమా సనా బంతితోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment