మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 25) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా ఫాస్ట్ బౌలర్ ఫాతిమా సనా ఎంపికైంది. మాజీ కెప్టెన్ నిదా దార్ స్థానంలో ఫాతిమాను ఎంపిక చేశారు పాక్ సెలెక్టర్లు. 22 ఏళ్ల సనాకు గతంలో దేశవాలీ జట్లకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. సనా.. నిదా గైర్హాజరీలో అప్పుడప్పుడు పాక్ కెప్టెన్‌గానూ వ్యవహరించింది. 2023 డిసెంబర్‌లో జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో సనా నేతృత్వంలోని పాక్ థ్రిల్లింగ్ సూపర్ ఓవర్ విక్టరీ సాధించింది.
త్వరలో జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ కోసం పాక్ సెలెక్టర్లు పెద్దగా మార్పులు చేయలేదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లోని జట్టునే యధాతథంగా కొనసాగించారు. 2024 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన వారిలో 2023 టీ20 వరల్డ్‌కప్ సభ్యులు 10 మంది ఉండటం విశేషం. అన్‌క్యాప్డ్ పేసర్ తస్మియ రుబాబ్ కొత్తగా జట్టులో చోటు దక్కించుకుంది. ఈ టోర్నీ కోసం పాక్ సెలెక్టర్లు ఓ ట్రావెలింగ్ రిజర్వ్, ఇద్దరు నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లను ఎంపిక చేశారు.
కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ ఇటీవలే బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ వేదికను మార్చింది. ఈ మెగా టోర్నీ యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి 30వ తేదీ వరకు జరుగనుంది.
పాకిస్థాన్ జట్టు: ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, గుల్ ఫిరోజా, ఇరామ్ జావేద్, మునీబా అలీ (వికెట్ కీపర్), నష్రా సుంధు, నిదా దార్, ఒమైమా సోహైల్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా, తస్మియా రుబాబ్, తుబా హసన్
ట్రావెలింగ్ రిజర్వ్: నజిహా అల్వీ (వికెట్ కీపర్)
నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రమీన్ షమీమ్, ఉమ్-ఎ-హాని
Comments
Please login to add a commentAdd a comment