మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో ఆదివారం ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన కీలక మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 152 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా విఫలమైంది.
ఛేజింగ్‌లో భారత అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి పరాజయం పాలైంది. ఈ ఓటమితో భారత జట్టు తమ సెమీస్ అవకాశాలను దాదాపు చేజార్చుకుందనే చెప్పాలి. ఇప్పుడు భారత్ సెమీస్ ఆశలన్నీ దాయాది పాకిస్తాన్ పైనే పెట్టుకుంది.
పాక్ గెలిచేనా?
గ్రూపు- ఎ నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకోగా.. రెండో స్ధానం కోసం భారత్, కివీస్ మధ్య నెలకొంది. భారత జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో ఉంది. అయితే టీమిండియా తమ నాలుగు లీగ్ మ్యాచ్‌లన్నీ ఆడేయగా, కివీస్‌కు మరో మ్యాచ్ మిగిలి ఉంది. భారత్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింట విజయాలు, మరో రెండింట ఓటములను చవిచూసింది.
భారత్ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. కాగా న్యూజిలాండ్ తాము ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సోమవారం పాకిస్తాన్‌తో జరగనున్న తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కివీస్ గెలిస్తే ఎలాంటి సమీకరణంతో పని లేకుండా మూడు విజయాలతో సెమీస్ ఆర్హత సాధిస్తుంది. ఈ క్రమంలో భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్ధానానికి చేరి టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
ఒక వేళ ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధిస్తే.. భారత్,కివీస్, పాక్ చెరో నాలుగు పాయింట్లతో సమంగా నిలుస్తారు. అయితే న్యూజిలాండ్(+0.282), పాకిస్తాన్(-0.488) కంటే భారత్(+0.322) రన్‌రేట్ మెరుగ్గా ఉన్నందన సెమీస్‌కు క్వాలిఫై కానుంది. కాగా బలహీనమైన పాక్ జట్టుపై కివీస్‌కు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. దాదాపుగా భారత్ సెమీస్ అవకాశాలు గల్లంతు అయినట్లే.
చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేళ జయవర్దనే
Comments
Please login to add a commentAdd a comment