ఆసీస్‌కు రెండో గెలుపు | Australia won a second consecutive win in womens T20 World Cup | Sakshi
Sakshi News home page

ఆసీస్‌కు రెండో గెలుపు

Published Tue, Nov 13 2018 1:45 AM | Last Updated on Tue, Nov 13 2018 1:46 AM

Australia won a second consecutive win in womens T20 World Cup - Sakshi

ప్రొవిడెన్స్‌ (గయానా): మహిళల టి20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై జయభేరి మోగించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌... కంగారూ బౌలర్లు ఎలీసా పెర్రీ (2/12), జార్జియా వారెహమ్‌ (0/8), సోఫీ మొలినెక్స్‌ (0/18) కట్టడి చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 93 పరుగులే చేయగలిగింది. కింబర్లీ గార్త్‌ (24) టాప్‌ స్కోరర్‌. ఛేదనలో ఓపెనర్‌ అలీసా హీలీ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగడంతో ఆసీస్‌ 9.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 94 పరుగులు చేసి గెలుపొందింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement