Alyssa Healy: మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న తొట్టతొలి మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) కోసం ఆయా జట్లు ఒక్కొక్కటిగా తమ సారధుల పేర్లను ప్రకటిస్తున్నాయి. తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్, భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధనను ప్రకటించగా.. తాజాగా యూపీ వారియర్జ్ తమ కెప్టెన్ పేరును అనౌన్స్ చేసింది.
యూపీ వారియర్జ్ కెప్టెన్‌గా ఆసీస్ వికెట్‌కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాటర్ అలైసా హీలీ నియమితురాలైంది. యూపీ వారియర్జ్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ స్పిన్నర్, యూపీకి చెందిన దీప్తి శర్మను ప్రకటిస్తారని అంతా ఊహించారు. అయితే యూపీ వారియర్జ్ మేనేజ్‌మెంట్ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ అలైసా వైపు మొగ్గు చూపింది.
రెగ్యులర్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ గైర్హాజరీలో పలు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా సారధిగా వ్యవహరించిన 32 ఏళ్ల అలైసా.. ఆ జట్టు గెలిచిన 5 టీ20 వరల్డ్‌కప్‌ల్లో, 2022 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఉంది. అలైసా తన ఓవరాల్ కెరీర్‌లో ఆసీస్ తరఫున 139 టీ20లు, 94 వన్డేలు, 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 6 శతకాలు, 30 అర్ధశతకాల సాయంతో 5400కు పైగా పరుగులు సాధించింది. అలైసా.. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ కెప్టెన్‌గానూ వ్యవహరించింది.
యూపీ వారియర్జ్ జట్టు: అలైసా హీలీ (కెప్టెన్), సోఫీ ఎక్లెస్‌స్టోన్, తహీలా మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, గ్రేస్ హ్యారిస్, లారెన్ బెల్ (విదేశీ ప్లేయర్లు), దీప్తి శర్మ, అంజలీ సర్వానీ, రాజేశ్వరీ గైక్వాడ్, పర్షవీ చోప్రా, స్వేతా సెహ్రావత్, ఎస్ యషశ్రీ,, కిరణ్ నవ్‌గిరే, దేవిక వైద్య, లక్ష్మీ యాదవ్, షేక్ సిమ్రన్
హెడ్ కోచ్: జోన్ లూయిస్ (ఇంగ్లండ్)
అసిస్టెంట్ కోచ్: అన్జు జైన్
బౌలింగ్ కోచ్: ఆష్లే నోఫ్కీ
మెంటార్: లీసా స్తాలేకర్
యూపీ వారియర్జ్ తొలి మ్యాచ్: మార్చి 5న గుజరాత్ జెయింట్స్‌తో
Comments
Please login to add a commentAdd a comment