WPL 2023 Delhi Capitals Vs UP Warriorz Match Live Score Updates And Highlights - Sakshi
Sakshi News home page

WPL 2023 DC Vs UPW : తాహిలా మెక్‌గ్రాత్‌ పోరాటం వృథా.. యూపీ వారియర్జ్‌ ఓటమి

Published Tue, Mar 7 2023 7:29 PM | Last Updated on Tue, Mar 7 2023 11:09 PM

WPL 2023: Delhi Capitals Women Vs UP Warriorz Match Live Updates - Sakshi

తాహిలా మెక్‌గ్రాత్‌ పోరాటం వృథా.. యూపీ వారియర్జ్‌ ఓటమి
వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 42 పరుగులతో విజయం సాధించింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. తాహిలా మెక్‌గ్రాత్‌ (50 బంతుల్లో 90 పరుగులు నాటౌట్‌, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాటం వృథా అయినా ఆకట్టుకుంది. ఆమె మినహా మిగతావారు విఫలమయ్యారు. జెస్‌ జొనాన్సెన్‌ మూడు వికెట్లు తీసింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. చివర్లో జెస్‌ జాన్సెన్‌ 20 బంతుల్లో 42 నాటౌట్‌, జెమీమా రోడ్రిగ్స్‌ 22 బంతుల్లో 34 నాటౌట్‌ విధ్వంసం సృష్టించారు.

16 ఓవర్లలో యూపీ వారియర్జ్‌ 113/4
16 ఓవర్లు ముగిసేసరికి యూపీ వారియర్జ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. మెక్‌గ్రాత్‌ 47 పరుగులు, వైద్య 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి 24 బంతుల్లో 99 పరుగులు కావాలి.

12 ఓవర్లలో యూపీ వారియర్జ్‌ 84/4
12 ఓవర్లు ముగిసేసరికి యూపీ వారియర్జ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. మెక్‌గ్రాత్‌ 34 పరుగులు, వైద్య 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 12 పరుగులు చేసిన దీప్తి శర్మ రాధా యాదవ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌కు వెనుదిరిగింది.

8 ఓవర్లలో యూపీ వారియర్జ్‌ స్కోరు 51/3
8 ఓవర్ల ఆట ముగిసేసరికి యూపీ వారియర్జ్‌ మూడు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. తాహిలా మెక్‌గ్రాత్‌ 11, దీప్తి శర్మ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి 72 బంతుల్లో 161 పరుగులు కావాలి.

► 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన యూపీ వారియర్జ్‌ కష్టాల్లో పడింది. క్యాప్స్‌ బౌలింగ్‌లో సెహ్రావత్‌(1 పరుగు) కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన యూపీ వారియర్జ్‌
212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత ధాటిగా ఆడుతున్న కెప్టెన్‌ అలిసా హేలీ(24 పరుగులు) జాన్సెన్‌ బౌలింగ్‌లో రాధా యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది.  ఆ తర్వాత గతమ్యాచ్‌ హీరో కిరణ్‌ నావగిరే 2 పరుగులు చేసి జాన్సెన్‌ బౌలింగ్‌లోనే వెనుదిరిగింది. ప్రస్తుతం యూపీ వారియర్జ్‌ రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. 

యూపీ వారియర్జ్‌ టార్గెట్‌ 212
వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌.. యూపీ వారియర్జ్‌ ముంగిట 212 పరుగుల భారీ టార్గెట్‌ను విధించింది. ఢిల్లీ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. చివర్లో జెస్‌ జాన్సెన్‌ 20 బంతుల్లో 42 నాటౌట్‌, జెమీమా రోడ్రిగ్స్‌ 22 బంతుల్లో 34 నాటౌట్‌ విధ్వంసం సృష్టించడడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్‌ బౌలింగ్‌లో సోఫీ ఎస్సెల్‌స్టోన్‌, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, తాహిలా మెక్‌గ్రాత్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

భారీ స్కోరుగా దిశగా ఢిల్లీ క్యాపిటల్స్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 14 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసిది. అలిస్‌ క్యాప్సీ 21, జెమీమా రోడ్రిగ్స్‌ 10 పరుగులతో ఆడుతున్నారు.

రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
16 పరుగులు చేసిన కాప్‌ వెనుదిరగడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో వికెట్‌ నష్టపోయింది. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. మెగ్‌ లానింగ్‌ 55 పరుగులతో ఆడుతుంది.

9 ఓవర్లలో 87/1
9  ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ నష్టానికి 87 పరుగులు చేసింది. మెగ్‌ లానింగ్‌ 53 పరుగులు, కాప్‌ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. డాషింగ్ ఒపెనర్ షఫాలీ వర్మ 17 పరుగుల వద్ద మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో వెనుదిరిగింది.  

3 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 18/0
మూడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. మెగ్‌ లానింగ్‌ 15, షఫాలీ వర్మ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఏంచుకున్న యూపీ వారియర్జ్‌
వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్స్‌ మధ్య మ్యాచ్‌ మొదలైంది. తాము ఆడిన తొలి మ్యాచ్‌లో విజయాలు సాధించిన ఇరుజట్లు తొలిసారి తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన యూపీ వారియర్స్‌ బౌలింగ్‌ ఏంచుకుంది. అయితే మ్యాచ్‌లో మెగ్‌ లానింగ్‌ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫెవరెట్‌గా కనిపిస్తోంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీని ఓడించడం యూపీ వారియర్జ్‌కు సవాలే. అయితే యూపీ వారియర్జ్‌ కూడా బలంగానే కనిపిస్తోంది. 

ఢిల్లీ క్యాపిటల్స్(ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, మారిజానే కాప్, జెమిమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా(వికెట్‌ కీపర్‌), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్

యూపీ వారియర్జ్ (ప్లేయింగ్ XI): అలిస్సా హీలీ(వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, దేవికా వైద్య, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement