స్టార్క్‌ను ట్రోల్‌ చేసిన భార్య | Starc Wife Alyssa Healy Reacts To His Dismissal | Sakshi
Sakshi News home page

స్టార్క్‌ను ట్రోల్‌ చేసిన భార్య

Published Mon, Jan 20 2020 2:43 PM | Last Updated on Mon, Jan 20 2020 2:58 PM

Starc Wife Alyssa Healy Reacts To His Dismissal - Sakshi

బెంగళూరు: భారత్‌తో జరిగిన మూడో వన్డేలో మిచెల్‌ స్టార్క్‌ను హిట్టింగ్‌ చేయడానికి ఐదో స్థానంలో పంపిన ఆస్ట్రేలియా వ్యూహం బెడిసికొట్టింది. తన రెగ్యులర్‌ స్థానం కంటే ముందుగా వచ్చిన స్టార్క్‌ కేవలం మూడు బంతులే ఆడి డకౌట్‌ అయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన 32 ఓవర్‌ ఆఖరి బంతికి సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ చహల్‌కు క్యాచ్‌ పెవిలియన్‌ చేరాడు. అదే ఓవర్‌ మూడో బంతికి లబూషేన్‌ పెవిలియన్‌ చేరితే, స్టార్క్‌ను హిట్టింగ్‌ కోసం ముందుగా పంపించారు. భారత్‌ ముందు సాధ్యమైనంత ఎక్కువ లక్ష్యం ఉండాలనే ఉద్దేశంతోనే స్టార్క్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చారు. (ఇక్కడ చదవండి: ఇక కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌: కోహ్లి)

అయితే ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ వ్యూహం ఫలించలేదు. స్టార్క్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఆసీస్‌ డీలా పడింది. కాగా, స్టార్క్‌ ఔటైన తీరును అతని భార్య అలీసా హేలీ కూడా ట్రోల్‌ చేసింది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టు సభ్యురాలైన అలీసా హేలీ.. ఇదేమి బ్యాటింగ్‌ భర్త గారూ అనే అర్థం వచ్చేలా ఒక ఎమెజీని పోస్ట్‌ చేశారు. ఫాక్స్‌ క్రికెట్‌ పోస్ట్‌ చేసిన ఫోటోకు సమాధానంగా తలను చేతితో కొట్టుకుంటున్న ఎమోజీ పోస్ట్‌ చేశారు. ఇది వైరల్‌ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో చమత్కరిస్తున్నారు. ‘ మేడమ్‌.. మీరు చెప్పిన బ్యాటింగ్‌ టెక్నిక్స్‌ను స్టార్క్‌ మరిచిపోయాడేమో’ అని ఒకరు రిప్లే ఇవ్వగా, ‘ బ్యాటింగ్‌ ఎలా చేయోలా స్టార్క్‌కు నేర్పించండి’ అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. ‘ ఓ మై గాడ్‌.. స్టార్క్‌ బ్యాటింగ్‌ చూసి నవ్వు ఆపులేకపోతున్నాం’ అని మరొకరు చమత్కరించారు. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టులో అలీసా హేలీ కీలక సభ్యురాలు. అటు వికెట్‌ కీపర్‌గా, బ్యాట్‌వుమన్‌గా ఎన్నో ఘనతలు ఆమె సొంతం. (ఇక్కడ చదవండి: ‘రోహిత్‌.. ఆనాటి మ్యాచ్‌ను గుర్తు చేశావ్‌’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement