
విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీమిండియా బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆసీస్ పేసర్ల దాటికి 117 పరుగులకే కుప్పకూలింది. కేవలం 26 ఓవర్లలోనే టీమిండియా ఆలౌట్ కావడం గమానార్హం. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 5వికెట్లతో టీమిండియా వెన్ను విరచగా.. అబాట్ మూడు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు సాధించారు.
స్టార్క్ తొలి ఓవర్‌లోనే గిల్‌ను ఔట్ చేసి తమ జట్టుకు అద్భుతమైన శుభారంభం ఇచ్చారు. అనంతరం ఏ దశలోనే టీమిండియా కోలుకోలేకపోయింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో అక్షర్ పటేల్ (29) పరుగులతో రాణించాడు. కాగా ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ(13) కూడా నిరాశపరిచాడు.
Comments
Please login to add a commentAdd a comment