అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన మార్క్ చూపించలేకపోయాడు. తనకు ఇష్టమైన వేదికలో మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి కోహ్లి ఔటయ్యాడు.
ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతితో విరాట్‌ను బోల్తా కొట్టించాడు. కోహ్లి తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే సూపర్ కవర్ డ్రైవ్ షాట్ ఆడి మంచి టచ్‌లో కన్పించాడు. అయితే భారత ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో తొలి బంతిని షార్ట్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.
అయితే తొలుత ఆ డెలివరీని ఢిపెన్స్ ఆడాలని భావించిన కోహ్లి.. ఆఖరి నిమిషంలో తన మనసు మార్చుకుని బంతిని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే కోహ్లి తన బ్యాట్‌ను వెనక్కి తీయడంలో కాస్త ఆలస్యమైంది.
దీంతో బంతి కోహ్లి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ చేతికి వెళ్లింది. క్యాచ్ అందుకోవడంలో స్మిత్ ఎటువంటి పొరపాటు చేయలేదు. దీంతో కోహ్లి నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లి అద్భుతమైన సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.
@Ro45Kuljot_ pic.twitter.com/Qt3QfgL2hI
— " (@Beast__010) December 6, 2024
Comments
Please login to add a commentAdd a comment