టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఫీట్ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన నాలుగో ఆస్ట్రేలియన్ బౌలర్‌గా నిలిచాడు. మ్యాచ్‌లో కోహ్లిని ఔట్ చేయడం ద్వారా స్టార్క్ ఈ ఘతన సాధించాడు.
ఇప్పటివరకు స్టార్క్ వన్డే, టెస్టులు, టి20లు కలిపి 591 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ 999 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. గ్లెన్ మెక్‌గ్రాత్ 948 వికెట్లతో రెండో స్థానంలో, బ్రెట్ లీ 718 వికెట్లతో మూడో స్థానంలో, నాలుగో స్థానంలో మిచెల్ స్టార్క్(591 వికెట్లు) ఉండగా.. ఐదో స్థానంలో మిచెల్ జాన్సన్(590 వికెట్లు) కొనసాగుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడకుండానే 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. ఇషాన్, కోహ్లిలు తక్కువకే వెనుదిరగ్గా.. సూర్య గోల్డెన్ డక్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 28 పరుగులుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment