పెర్త్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆసీస్ స్టార్ పేసర్ మిచిల్ స్టార్క్‌ను భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ స్లెడ్జింగ్ చేసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా "నువ్వు చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నావు" అని స్టార్క్ అన్నాడు.
ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. అయితే ఆ సమయంలో స్టార్క్ నుంచి మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకుండా, నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా ఇదే విషయంపై మిచిల్ స్టార్క్ స్పందించాడు. ఆ సమయంలో యశస్వి అన్న మాటలను తను వినలేదని స్టార్క్ చెప్పుకొచ్చాడు.
వాస్తవానికి ఆ రోజు నేను చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తానని జైశ్వాల్ చెప్పడం నేను వినలేదు. ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడలనుకోవడం లేదు. కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరముంది. మూడో రోజు ఆటలో ఓ షార్ట్ పిచ్ డెలివరీని జైశ్వాల్ ప్లిక్ షాట్ ఆడాడు.ఆ బంతిని అతడు సిక్సర్‌గా మలిచాడు.
మరోసారి దాదాపుగా అలాంటి బంతినే వేశాను. కానీ ఈసారి అతడు డిఫెన్స్ ఆడాడు. వెంటనే అతడి వద్దకు వెళ్లి ఫ్లిక్ షాట్ ఎక్కడ? అని అడిగాను. అతడు నన్ను చూసి నవ్వాడు. దీంతో ఆ విషయాన్ని ఇద్దరం అక్కడితో వదిలేశామని" స్టార్క్ క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
అదేవిధంగా జైశ్వాల్‌పై స్టార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో భయంలేని బ్యాటర్లలో జైశ్వాల్ ఒకడిని, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతున్నాడని స్టార్క్ కొనియాడాడు.
చదవండి: SA vs SL 2nd Test: రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే
Comments
Please login to add a commentAdd a comment