టీమిండియాతో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు | Australia's Starc And Maxwell Ruled Out Of First ODI Against India | Sakshi
Sakshi News home page

టీమిండియాతో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు

Published Thu, Sep 21 2023 2:45 PM | Last Updated on Thu, Sep 21 2023 2:55 PM

Starc And Maxwell Ruled Out Of First ODI Against India - Sakshi

మొహాలీ వేదికగా టీమిండియాతో రేపు (సెప్టెంబర్‌ 22) జరుగబోయే తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ జట్టు స్టార్‌ ఆటగాళ్లు మిచెల్‌ స్టార్క్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ గాయాల కారణంగా తొలి వన్డేకు దూరం కానున్నారు. ఈ విషయాన్ని ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ కొద్దిసేపటి కిందట నిర్ధారించారు. గజ్జల్లో నొప్పి కారణంగా స్టార్క్‌.. చీలిమండ గాయం కారణంగా మ్యాక్సీ తొలి మ్యాచ్‌కు దూరంగా ఉంటారని స్టార్క్‌ తెలిపారు.

మరోవైపు సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉన్న కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌లు భారత్‌తో తొలి వన్డేకు సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరూ పూర్తి ఫిట్‌నెస్ట్‌ సాధించి, బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. స్టార్క్‌, మ్యాక్స్‌వెల్‌ మినహా తొలి వన్డేలో ఆసీస్‌ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది.

ఇదిలా ఉంటే, భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య సెప్టెంబర్‌ 22, 24, 27 తేదీల్లో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి వన్డే మొహాలీలో, రెండో వన్డే ఇండోర్‌లో, మూడో వన్డే రాజ్‌కోట్‌లో జరుగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్‌ అయిపోయిన వెంటనే వరల్డ్‌కప్‌ సన్నాహక మ్యాచ్‌లు మొదలవుతాయి. అక్టోబర్‌ 5 నుంచి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు స్టార్ట్‌ అవుతాయి.

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌-గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో 2023 వరల్డ్‌కప్‌ మొదలవుతుంది. అహ్మదాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది. మెగా టోర్నీలో భారత్‌.. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. ఆతర్వాత అక్టోబర్‌ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో, అక్టోబర్‌ 14న పాకిస్తాన్‌లను ఢీకొంటుంది. చిరకాల  ప్రత్యర్ధితో మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. 

టీమిండియా: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్‌, మిచెల్ మార్ష్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement