మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చేరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో పాక్ బ్యాట్లకు స్టార్క్ చుక్కలు చూపించాడు. తన 10 ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇందులో మూడు మేడిన్ ఓవర్లు ఉండడం విశేషం. స్టార్క్‌తో పాటు స్పిన్నర్ ఆడమ్ జంపా, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. దీంతో పాకిస్తాన్ 46.2 ఓవర్లలో కేవలం 203 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ రిజ్వాన్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నసీం షా(40) ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
స్టార్క్ అరుదైన రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో చెలరేగిన మిచెల్ స్టార్క్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. స్వదేశంలో వన్డేల్లో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న ఆరో ఆసీస్ బౌలర్‌గా స్టార్క్ రికార్డులకెక్కాడు. పాక్ ఓపెనర్లు షఫీక్, అయూబ్‌లను ఔట్ చేసి స్టార్క్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో స్టార్క్ కంటే ముందు బ్రెట్ లీ, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్,క్రెయిగ్ మెక్‌డెర్మాట్‌లు ఉన్నారు. కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు స్టార్క్‌ను కేకేఆర్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని ఐపీఎల్-2024 మినీవేలంలో ఏకంగా 24.75 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరి కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment