
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కీలక సభ్యుడు మిచెల్ స్టార్క్

పేస్ దళంలో ముఖ్యుడిగా ఉన్న స్టార్క్ ఆసీస్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఆస్ట్రేలియా తరఫున నాలుగు సార్లు ప్రపంచకప్ టైటిల్ గెలిచిన ఘనత స్టార్క్ సొంతం.

ప్రపంచస్థాయి పేసర్లలో స్టార్క్ ముందు వరుసలో ఉంటాడనంలో సందేహం లేదు.

స్టార్క్ భార్య అలీసా హేలీ కూడా క్రికెటరే. ఆమె కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహిస్తోంది.

ప్రస్తుతం స్టార్క్ ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత స్టార్క్ ఐపీఎల్ వేలంలోకి రాగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ రికార్డు ధరకు కొనుగోలు చేసింది.

ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టి స్టార్క్‌ను సొంతం చేసుకుంది. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఈ ఆసీస్ పేసర్ రికార్డు సాధించాడు.

మరోవైపు.. స్టార్క్ సతీమణి అలిసా హేలీ వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. రూ. 70 లక్షలకు ఆమెను కొనుగోలు చేసిన యూపీ వారియర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. విధ్వంసకర బ్యాటర్‌గా.. బౌలర్‌గానూ హేలీకి పేరుంది.

హేలీ యూపీకి ఆడేటపుడు స్టార్క్ ఆ జట్టు ధరించి ఆమెను ఉత్సాహపరిచాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా హైలీ కేకేఆర్ జెర్సీ ధరించి స్టార్క్‌ను చీర్ చేసింది.

ఇక ఇప్పటిదాకా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన స్టార్క్.. భార్య హాజరైన మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో చెలరేగి కేకేఆర్‌ను గెలిపించడం విశేషం.

ఇక ఐసీసీ టీ20-2020, వన్డే- 2022 వరల్డ్‌కప్‌లో ఆసీస్ తరఫున హేలీ అదరగొట్టింది.
