
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal), అతడి భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma) అధికారికంగా విడిపోయినట్లు తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గురువారం బాంద్రా కోర్టు బయట చాహల్ కన్పించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.

"దేవుడు నన్ను నేను లెక్కించగలిగే దానికంటే ఎక్కువ సార్లు రక్షించాడు. ఆ సందర్బాలు కూడా నాకు గుర్తులేవు. నేను కష్టాల్లో ప్రతీ సమయంలోనూ దేవుడు నన్ను కాపాడాడు. ఎప్పుడూ నాకు రక్షణగా ఉన్న దేవుడుకి కృతజ్ఞతలు’ అని చాహల్ రాసుకొచ్చాడు.

దేవుడిపై మీకున్న విశ్వాసం మీకు మంచి జరిగేలా చేస్తుంది అంటూ ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ను షేర్ చేసింది.

కాగా 2020లో కొవిడ్ లాక్ డౌన్ సమయంలో కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీతో వర్మతో చాహల్‌కు పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో డిసెంబర్ 2020లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.











