భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది చివర్లలో బోర్డర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అమీతుమీ తెల్చుకోనుంది.
పాకిస్తాన్‌తో దైపాక్షిక సిరీస్‌లు జరగపోయినప్పటి నుంచి భారత్‌కు అత్యంత ముఖ్యమైన టెస్ట్ సిరీస్‌లలో ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒకటిగా మారింది. దీంతో ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ సిరీస్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు.
కాగా గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంత గడ్డపై ఓడించిన భారత్.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఈసారి భారత్‌పై ఎలాగైనా టెస్టు సిరీస్ విజయం సాధించి తమ 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆసీస్ భావిస్తోంది. టీమిండియాపై టెస్టు సిరీస్‌ను ఆసీస్ చివరగా 2014-15లో సొంతం చేసుకుంది.
ఈ సిరీస్ కోసం ఆసీస్ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియన్ క్రికెటర్లు, తమ అభిమానులకు బీజీటీ ట్రోఫీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌తో సమనమని స్టార్క్ అభిప్రాయపడ్డాడు.
"ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. దీంతో ఈ బీజీటీ ట్రోఫీ యాషెస్ సిరీస్‌తో సమానం. మా సొంతగడ్డపై ప్రతీ మ్యాచ్‌లోనూ మేము విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాము.
కానీ భారత్ మాత్రం చాలా బలమైన ప్రత్యర్ధి. ఆ జట్టును ఓడించడం అంత ఈజీ కాదు. భారత్, ఆసీస్ డబ్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్నాయి. కాబట్టి ఈ సిరీస్ అభిమానులకు మంచి థ్రిల్‌ను పంచుతుంది. ఈ సారి భారత్‌ను ఎలాగైనా ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంటామని ఆశిస్తున్నాను" అని వైడ్ వరల్డ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్క్ పేర్కొన్నాడు.
కాగా 32 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ టెస్టు సిరీస్ జరగనుంది. చివరగా 1991-92లో ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది.ఈ ఏడాది నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment