ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2024 వేలంలో స్టార్క్‌ను రూ.24.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. ఈ ఆసీస్ పేసర్ కోసం ఢిల్లీ, ముంబై,గుజరాత్,కోల్‌కతా తీవ్రంగా పోటీ పడ్డాయి.
కానీ చివరి వరకు ఎక్కడ తగ్గని కేకేఆర్.. ఈ యార్కర్ల కింగ్‌ను దక్కించుకుంది. అంతకంటే ముందు ఇదే వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్యాట్ కమ్మిన్స్(రూ.20.50 కోట్లు) రికార్డును స్టార్క్ బ్రేక్ చేశాడు. ఇక ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కడంపై స్టార్క్ స్పందించాడు.
"నిజంగానే షాక్‌కు గురయ్యాను. ఇంత మొత్తాన్ని అసలు ఊహించలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 లీగ్‌లో మళ్లీ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు విలువ పెరిగినా నా ఆటతీరు ఎప్పుడూ మారలేదు. భారీ మొత్తం కాబట్టి ఒత్తిడి సహజమే అయినా... నాకున్న అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉందని" స్టార్ స్పోర్ట్స్‌తో స్టార్క్ పేర్కొన్నాడు.
కాగా మిచెల్ స్టార్క్ గతంలో ఐపీఎల్‌లో ఆడిన అనుభవం పెద్దగా లేదు. అతడు కేవలం రెండు సార్లు మాత్రమే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడాడు. 2014, 15 సీజన్‌లలో ఆర్సీబీ తరపున స్టార్క్ ప్రాతినిథ్యం వహించాడు. 27 మ్యాచ్‌లలో 7.16 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత వేర్వేరు కారణాలతో అతను ఎనిమిది సీజన్ల పాటు లీగ్‌కు దూరంగా ఉన్నాడు. 2018లో కోల్‌కతా అతడిని ఎంచుకున్నా... గాయంతో టోర్నీకి ముందే తప్పుకున్నాడు.
చదవండి: ENG vs WI: ఇదేమి విధ్వంసం.. ఏకంగా 267 పరుగులు! పాపం విండీస్
Comments
Please login to add a commentAdd a comment